Mercury Transit: బుధ గ్రహ మార్పు..ఐదు రాశులకు రాజయోగం..!

Published : May 06, 2025, 10:06 AM IST

బుధ గ్రహం  రాశి మార్పు దాదాపు ఎవరికైనా శుభ ఫలితాలనే తీసుకువస్తుంది. ఈ గ్రహం మే 7వ తేదీన మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మేష రాశిలో సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు బుధ గ్రహం కూడా వెళ్లి కలవనుంది. ఈ రెండింటి కలయిక ఐదు రాశుల వారికి మునుపెన్నడూ చూడని రాజయోగం వరించనుంది.  

PREV
16
Mercury Transit: బుధ గ్రహ మార్పు..ఐదు రాశులకు రాజయోగం..!

బుధ గ్రహాన్ని బుద్ధి, తెలివి, మాట, ఉద్యోగం, వ్యాపారానికి సంకేతంగా సూచిస్తారు. అందుకే.. బుధగ్రహ సంచారం ఎప్పుడూ మంచే మోసుకొస్తుంది. ఈ మే 7 తేదీన జరిగే బుధ గ్రహ సంచారం వల్ల భద్ర మహాపురుష, బుధారిత్య రాజయోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు.. ఐదు రాశులకు రాజయోగం తెచ్చి పెడతాయి. ఎంతలా అంటే, ఊహించని లాభాలు తీసుకువస్తాయి. మరి, ఆ ఐదు రాశులేంటో చూసేద్దామా..

26
telugu astrology

1.వృషభ రాశి..

వృషభ రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం శుభప్రదం. ధనలాభం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. సమాజంలో, ఇంట్లో గౌరవం పెరుగుతుంది. మీ మాటతీరు బాగుంటుంది. మీడియా, బ్యాంకింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి విజయం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.
 

36
telugu astrology

2.మిథున రాశి..

మిథున రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం శుభ ఫలితాలనిస్తుంది. కలలు నెరవేరే సమయం ఇది. వ్యక్తిత్వంలో మంచి మార్పులు వస్తాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. సమస్యలు తొలగిపోతాయి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ధనార్జన మార్గాలు తెరుచుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో అనుకూల ఫలితాలుంటాయి.
 

46
telugu astrology

3.సింహ రాశి..
సింహ రాశి వారు రాజయోగం వల్ల రాజులా జీవిస్తారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలుంటాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ధార్మిక యాత్రలు విజయవంతమవుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు ఆదా చేయగలుగుతారు.

56
telugu astrology

4.కన్య రాశి..

కన్య రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం వల్ల మంచి లాభాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. వ్యక్తిగత, వృత్తి జీవితం బాగుంటుంది. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
 

66
telugu astrology

5.మకర రాశి..

మకర రాశి వారు రాజయోగం వల్ల మంచి జీవితం గడుపుతారు. అదృష్టం కలిసివస్తుంది. జీతం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనార్జనకు అవకాశాలుంటాయి. సొంత ఇల్లు లేదా స్థిరాస్తి కొనుగోలు చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories