జ్యోతిష్య పండితుల ప్రకారం మిథున రాశి వారికి బుధుడి నక్షత్ర మార్పు చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో ఈ రాశివారి తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. మీడియా, రచన, బ్యాంకింగ్, పరిశోధన, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారు మంచి పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.