Mercury Luck: బుధుడు దశాంశ యోగంతో ఈ 3 రాశులవారికున్న డబ్బు కష్టాలు తీరినట్టే

Published : Dec 28, 2025, 01:46 PM IST

Mercury Luck: 2025 ముగిసి కొత్త ఏడాది మొదలవ్వబోతోంది. ఇదే సమయంలో బుధ గ్రహం యముడితో కలిసి దశాంశ యోగాన్ని సృష్టించబోతున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి విపరీత రాజయోగం దక్కుతుంది. అప్పుల కష్టాలు తీరిపోతాయి.

PREV
14
బుధుడి వల్ల దశాంశ యోగం

జ్యోతిషంలో బుధుడికి ఎంతో మంచి ప్రాధాన్యం ఉంది. ఒకరి జాతకంలో బుధుడు మంచి స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి వాక్కు, తెలివి, వ్యాపారానికి కారకుడు. బుధుడు మంచిగా ఉంటే చాలు వ్యాపారంలో, ఉద్యోగంలో దూసుకెళ్లడం ఖాయం. బుధుడు డిసెంబర్ 30న యముడితో కలిసి అరుదైన దశాంశ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఏర్పడే ఈ యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. వారికి అప్పులన్నీ తీరిపోయే అవకాశం ఉంది. ఆర్ధికంగా కలిసొస్తుంది.

24
ధనుస్సు రాశి

బుధుడు ఏర్పరచే దశాంశ యోగం ధనుస్సు రాశి వారికి విపరీతంగా కలిసివస్తుంది.  ఈ రాశి వారికి అదృష్టం తీసుకొస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి బుధుడి వల్ల లాభాలు కలుగుతాయి. ఇక కొందరి దగ్గర ఆగిపోయిన  డబ్బు చేతికి వస్తుంది. మధ్యలో నిలిచి పోయిన పనులు పూర్తవుతాయి. ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. కొత్త ఏడాది వీరికి శుభప్రదంగా ప్రారంభమవుతుంది. 

34
మిథున రాశి

మిథున రాశికి బుధుడు ఎంతో మంచి ఫలితాలను అందిస్తుంది. దశాంశ యోగం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే వ్యక్తుల వ్యక్తిత్వం, తెలివి మెరుగవుతాయి. ఇక ఐటీ, మీడియా రంగంలో ఉన్నవారికి కొత్త సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరికి కొత్త ఏడాదిలో ఊహించని ధనలాభం కలుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపార విస్తరించే అవకాశం ఉంది.

44
కుంభం

కుంభ రాశి వారి జీవితంలో బుధుడు వల్ల ఏర్పడే యోగం పెద్ద మార్పులకు కారణం అవుతుంది. అనవసర ఖర్చులు  చాలా వరకు తగ్గించుకుంటారు. బాగా పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. అప్పుల బాధ నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. కొత్త సంవత్సరం కుంభ రాశి వారికి చాలా బాగుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories