Zodiac sign: 2025 ఏడాది చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాదిలో చివరి వారం మిగిలి ఉంది. ఈ వారం 5 రాశుల వారికి కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటి.? ఈ వారం వారికి ఎలా ఉండనుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కాలంలో తుల రాశి వారికి రాజయోగ ప్రభావం కనిపిస్తోంది. పెద్దగా శ్రమ లేకుండానే అనుకున్న పనులు పూర్తవుతాయి. విజయ సూచనలు బలంగా ఉన్నాయి. ఎదురయ్యే అవకాశాలను వదులుకోకుండా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం పూర్తి స్థాయిలో లభిస్తుంది. వృత్తి పరమైన నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. కష్టసమయంలో స్నేహితులు తోడుగా నిలుస్తారు. అదృష్టం అనుకోకుండా తలుపు తడుతుంది. లక్ష్మీనారాయణుల ఆరాధన శుభప్రదం.
25
కుంభ రాశి వారికి గుర్తింపు పెరుగుతుంది
కుంభ రాశి వారికి కార్యసిద్ధి సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల నుంచి సంతృప్తికరమైన ఫలితాలు అందుతాయి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. మీ చర్యల వల్ల ఇతరులకు మేలు కలుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. దశమ సూర్యయోగ ప్రభావంతో జీవితం మరో మెట్టు ఎక్కుతుంది. అధికార సంబంధ లాభాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరిగి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. బుధగ్రహ శ్లోకం జపించడం మంచిది.
35
కన్య రాశి వారికి లాభాలు
కన్య రాశి వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. భూమి, ఇల్లు, వాహనం సంబంధించిన యోగాలు కనిపిస్తున్నాయి. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం లాభాన్ని ఇస్తుంది. కాలాన్ని సరిగ్గా వినియోగిస్తే ముందడుగు వేయగలుగుతారు. మనోబలం ప్రతి పనిలో దోహదపడుతుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు మాటల్లో సౌమ్యత అవసరం. వారాంతానికి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. సూర్యుని స్మరణ శుభఫలితాలను ఇస్తుంది
కర్కాటక రాశి వారికి సంపూర్ణ విజయ సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు నడిపిస్తుంది. అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. చేసిన కృషికి తగిన ఫలితాలు అందుతాయి. కీలక విషయాల్లో అనుకూల నిర్ణయాలు వస్తాయి. శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. భూమి సంబంధ లాభాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. విష్ణు సహస్రనామ స్మరణ మేలు చేస్తుంది.
55
ధనస్సు రాశి వారికి సమస్యలున్నా..
ధనస్సు రాశి వారికి దైవబలం తోడుగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను మార్చే ఆలోచన వద్దు. చివరి ఫలితాలు అనుకూలంగా మారతాయి. అభిప్రాయ భేదాలు తలెత్తకుండా సంయమనం అవసరం. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మంచిది. లక్ష్య సాధనకు ఏకాగ్రత చాలా ముఖ్యం. వేంకటేశ్వర స్వామి స్మరణ శుభం కలిగిస్తుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.