ప్రతి నెల 5, 14, 23 తేదీలలో జన్మించిన పురుషులకు పుట్టిన పిల్లలు అదృష్టవంతులు. 5వ సంఖ్యకు అధిపతి బుధుడు. బుధ గ్రహం వాక్కు, తెలివితేటలు, వ్యాపారానికి కారకుడు. ఐదవ సంఖ్యను కలిగి ఉన్న పురుషులు చాలా తెలివైన వారిగా ఉంటారు. మాట్లాడడంలో ఆరితేరిపోతారు. వీరు ప్రముఖ వ్యాపారవేత్తలుగా, వక్తలుగా, రచయితలుగా, ప్రముఖ వ్యక్తులుగా మారతారు. కీర్తిని సంపాదిస్తారు. తద్వారా డబ్బులు సంపాదించి తమ పిల్లలకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందిస్తారు. సంపదను కూడబెట్టి వారసత్వంగా ఇస్తారు.