Zodiac sign: ఈ రాశుల వారు ప్రేమ‌లో అబ‌ద్ధాలు చెబుతుంటారు? ఇంత‌కా రాశులేంటీ, ఎందుక‌లా చెప్తారు.

Published : Feb 20, 2026, 12:09 PM IST

Zodiac sign: ప్రతి సంబంధం నిజాయితీ, నమ్మకం మీదే నిలుస్తుంది. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ప్రేమలో నిజాన్నిదాచుతారు. గొడవలు రాకుండా ఉండాలని, సంబంధం కాపాడాలని భావించి కొన్నిసార్లు నిజాన్ని మార్చి చెబుతుంటారు. ఇంతకీ ఆ రాశులు ఏవంటే 

PREV
15
మిథున రాశి

మిథున రాశిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. మాటల్లో చురుకుగా ఉండే ఈ రాశి వారు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో నైపుణ్యం కలిగినవారు. వీరు ఎప్పుడూ పెద్ద అబద్ధాలు చెప్పకపోయినా, కథను తాము అనుకున్న దిశగా మలచగలరు. భావోద్వేగాల్లో స్థిరత్వం తక్కువగా ఉండటం వల్ల త‌రుచూ మారుతుంటారు. దీంతో భాగస్వామికి గందరగోళం కలగొచ్చు.

25
మీన రాశి

మీన రాశి వారు గొడవలు అస్సలు ఇష్టపడరు. ప్ర‌శాంత‌త కోసం కొన్ని సార్లు పూర్తి నిజం చెప్ప‌కుండా స‌గం నిజం చెబుతుంటారు. వీరికి లోతైన ఆలోచనలు చేసే స్వభావం ఉంటుంది. వారి ఉద్దేశం తప్పు కాకపోయినా, విషయాలను దాచిపెట్టడం వల్ల వారిపై నమ్మకం తగ్గే పరిస్థితి రావచ్చు.

35
తుల రాశి

తుల రాశి వారు జీవితంలో సమతుల్యత, మంచి వాతావరణం కోరుకుంటారు. భాగస్వామి బాధపడకూడదనే ఉద్దేశంతో నిజాన్ని కొంచెం మృదువుగా మార్చి చెబుతారు. ప్రతి ఒక్కరికీ నచ్చాలని కోరుకునే స్వభావం ఉండటంతో, తమ ఇమేజ్ కాపాడుకోవడానికి కొన్నిసార్లు నిజం దాచే ప్రయత్నం చేస్తారు. సంబంధం చెడిపోకూడదనే ఆలోచనే వీరి ప్రవర్తనకు కారణం.

45
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు సాధారణంగా ఓపెన్ మైండ్‌తో ఉంటారు. కానీ తమ స్వేచ్ఛకు భంగం కలిగితే విషయాలను పూర్తిగా చెప్పకుండా దాచుతారు. భావోద్వేగ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని భావించినప్పుడు కొంత సమాచారం చెప్పకపోవచ్చు. ఇది మోసం చేయాలనే ఉద్దేశంతో కాకపోయినా, భాగస్వామికి సందేహాలు కలిగించవచ్చు.

55
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు రహస్యంగా ఉండే స్వభావం కలిగినవారు. వీరి భావోద్వేగాలు బ‌లంగా ఉంటాయి. సంబంధంలో నియంత్రణ తమ చేతిలో ఉండాలని భావిస్తారు. కొన్నిసార్లు అసూయ రేకెత్తించేలా ప్రవర్తించవచ్చు. అలా చేసి భాగస్వామి దృష్టి తమపై ఉండాలని కోరుకుంటారు. నిజాన్ని పూర్తిగా చెప్పకపోవడం వీరి ప్రత్యేక లక్షణంగా చెబుతుంటారు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో స‌మాచారం, ప‌లువురు పండితులు తెలిపిన విష‌యాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories