ఆగస్టులో జన్మించిన వారు విశాలహృదయులు. అందరినీ ప్రేమతో చూసుకోవాలని కోరుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే..అందరినీ సలహాలు అడుగుతారు. కానీ, తమ నిర్ణయాన్ని ఎవరైనా ఆపాలని చూసినా, అడ్డుకున్నా వీరికి నచ్చదు. భాగస్వామి తమ ఆలోచనలను గౌరవించకపోతే వారికి దూరమవుతారు. ఆలోచనలను పంచుకునే వ్యక్తితో జీవించాలని కోరుకుంటారు.