నేడు ఓ రాశివారికి అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి!

Published : Aug 21, 2025, 05:00 AM IST

ఈ రాశి ఫలాలు 21.08.2025 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధు మిత్రులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

413
మిథున రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు. కీలక వ్యవహారాలలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. పిల్లల చదువు విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసిరావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృథా ఖర్చులుంటాయి.

613
సింహ రాశి ఫలాలు

ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

713
కన్య రాశి ఫలాలు

ఉద్యోగులు అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి.

813
తుల రాశి ఫలాలు

నిరుద్యోగుల కష్టం ఫలించదు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఇంట్లో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. దూరప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో ఊహించని సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి.

1113
మకర రాశి ఫలాలు

దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

1313
మీన రాశి ఫలాలు

నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు అతికష్టం మీద పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories