Zodiac sign: మే 14 నుంచి కీల‌క మార్పులు.. ఈ 4 రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే

Published : May 13, 2025, 02:19 PM IST

గ్ర‌హాల్లో జ‌రిగే మార్పులు రాశుల‌పై ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే వీటిలో కొన్ని మంచి చేసేవి ఉంటే మ‌రికొన్ని చెడు ఫ‌లితాల‌ను అందిస్తాయి. తాజాగా ఇలాంటి ఒక కీల‌క మార్పు జ‌ర‌గ‌నుంది. మే 14వ తేదీన బృహ‌స్ప‌తి మిథున రాశిలోకి మార‌నున్నాడు. దీని ప్ర‌భావం కొన్ని రాశుల‌పై ప‌డ‌నుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
16
Zodiac sign: మే 14 నుంచి కీల‌క మార్పులు.. ఈ 4 రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే

బృహస్పతి అంటే గురు గ్రహం. ఇది జ్ఞానం, అభివృద్ధి, ధనసంపాదనకు సంబంధించిన గ్రహం. మే 14, 2025న బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది అతని ఏడాదికి ఒకసారి జరిగే ముఖ్యమైన సంచారము. ఈ మార్పు కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వీరు ఆర్థిక, వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. 
 

26

సింహ రాశి: 

ఈ స‌మ‌యంలో సింహ రాశి వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.  కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబంతో సమయం గడపడం మంచిది. అభిమానం చూపించడం వల్ల సంబంధాలు మెరుగవుతాయి.  పనిలో ఒత్తిడిగా అనిపించొచ్చు. కానీ వాటి నుంచి పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. అనవసరంగా మనసు కలతపడే పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి.

36

తుల రాశి: 

తుల రాశి వారికి ఇది కొంత సంక్లిష్టమైన సమయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఖర్చులు అదుపులో ఉంచాలి. అవసరమైన ఖర్చులు మాత్రమే చేయాలి. కార్యాలయంలో లేదా వ్యాపారంలో సహచరులతో వివాదాలు రానివ్వకండి. ఎవరైనా మోసం చేసే అవకాశం ఉంది. ఇత‌రుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. 

46
Sagittarius
ధనుస్సు రాశి: 

బృహస్పతి మార్పు ధనుస్సు వారికి ఆర్థిక పరంగా సవాళ్లు తేనుంది. అవసరం లేని ఖర్చుల జోలికి వెళ్ల‌కండి. వీలైనంత వ‌ర‌కు పొదుపు చేయండి. కొత్త వ్యాపారాలు లేదా పెట్టుబడులు పెట్టే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోండి. తక్కువ సమయంలో ఎక్కువ లాభం అనే వాటికి దూరంగా ఉండండి. 
56
Image: Pexels

మీన రాశి: 

ఈ సంచారం మీన రాశి వారికి కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. పనిలో ఏ చిన్న తప్పు చేసినా అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలను పూర్తిగా ఆలోచించి తీసుకోండి. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు మంచిది కావు. మీ పనిని ఇతరులు గమనిస్తారు, అందుకే ప్రతిఒక్క విషయంలో జాగ్రత్త అవసరం. 

66

బృహస్పతి సంచార మార్పు కొన్ని రాశుల వారికి పరీక్ష సమయం లాంటిద‌ని చెప్పాలి. అయితే సరైన జాగ్రత్తలు, దైర్యంగా ముందుకెళ్లే తీరు ఉంటే ఈ సమయాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు. ఏ రాశి వారైనా, ఓర్పు, బుద్ధి, జాగ్రత్తలతో వ్యవహరిస్తే ప్రతికూలతలను కూడా అనుకూలతలుగా మార్చుకోవ‌చ్చు.

Read more Photos on
click me!

Recommended Stories