జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు.. శక్తి, ధైర్యం, కార్యదీక్షకు ప్రతీక. కుజుడు, వ్యక్తిలో ఉత్సాహం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను సూచిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో కుజుడు బలంగా ఉంటే వారు ధైర్యంగా, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. పండితుల ప్రకారం, ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు కుంభరాశిలో సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి ఆర్థిక లాభాలు కలగనున్నాయి. వారు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవో ఇక్కడ చూద్దాం.