Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 3 రాశులకు తిరుగే లేదు!

Published : Apr 27, 2025, 02:41 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం రాశులు, నక్షత్రాలు మారుస్తూ ఉంటాయి. బలం, శక్తి, ధైర్యానికి కారకుడైన కుజుడు త్వరలో నక్షత్ర రాశిని మారనున్నాడు. ఈ ప్రభావంతో 3 రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎప్పటినుంచి ఉన్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మరి అదృష్ట రాశులెంటో చూద్దామా..

PREV
15
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 3 రాశులకు తిరుగే లేదు!

మే నెలలో కుజుడు నక్షత్ర రాశిని మారనున్నాడు. మే 12, 2025 ఉదయం 8.55 గంటలకు ఆశ్లేష నక్షత్రంలో కుజుడు సంచరిస్తాడు. జూన్ 7, 2025 వరకు కుజుడు ఈ నక్షత్రంలో ఉంటాడు. కుజుడి నక్షత్ర గమనం వల్ల 3 రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.

25
ఏ రాశులకు అదృష్టం కలిసివస్తుంది?

కుజుడు ధైర్యం, బలం, శక్తికి కారకుడు. ఆశ్లేష నక్షత్రం 27 నక్షత్రాల్లో తొమ్మిదవది. కుజుడి గమనం కొన్ని రాశులకు మంచి ఫలితాలను ఇస్తుంది. కుజుడి నక్షత్ర మార్పు వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో ఇక్కడ చూద్దాం.

35
మిథున రాశి

కుజుడి నక్షత్ర మార్పు వల్ల మిథున రాశి వారికి ఎక్కువ లాభాలు వస్తాయి. పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం. పాత ఆస్తి నుంచి డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లైనవారికి, పెళ్లి కానివారికి ఇంట్లో ఆనందం ఉంటుంది.

45
తుల రాశి

తుల రాశి వారికి రాబోయే కాలం ఆర్థికంగా చాలా బాగుంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తీరే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టేవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలుగుతుంది.

55
మకర రాశి

మకర రాశి వారికి ఉద్యోగంలో సాలరీ పెరుగుతుంది. కొత్త ఉమ్మడి వ్యాపార ప్రాజెక్టుల్లో లాభాలు వస్తాయి. కుజుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లైనవారు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories