Traditional Beliefs: మంగళసూత్రం మెడలో నుంచి తీస్తే భర్త ఆయుష్షు తగ్గుతుందా? శాస్త్రం ఏం చెబుతోంది?

Published : Jan 28, 2026, 04:43 PM IST

హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి పవిత్ర స్థానం ఉంది. ఇది భార్యా భర్తల సంబంధాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక, సామాజిక సంకేతం. మంగళసూత్రం మెడలో నుంచి తీస్తే భర్త ఆయుష్షు తగ్గుతుందా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. దీనిపై శాస్త్రం ఏం చెబుతోందో చూద్దాం. 

PREV
16
మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీస్తే ఏమవతుంది?

మన సమాజంలో మంగళసూత్రం చుట్టూ చాలా నమ్మకాలు, అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీస్తే భర్త ఆయుష్షు తగ్గుతుందని కొందరు నమ్మితే.. మెడలో మంగళసూత్రం లేకపోతే ఏదో భర్తకు ఏదో ఒక చెడు జరుగుతుందని మరికొందరు నమ్ముతారు. అసలు నిజంగానే ఇలా జరుగుతుందా? దీని గురించి జ్యోతిష్య పండితులు, శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
సౌభాగ్య సూచిక మాత్రమే

పురాణాలలో మంగళసూత్రాన్ని “సౌభాగ్య సూచిక”గా మాత్రమే వివరించారు. వివాహ సమయంలో వరుడు వధువుకు మంగళసూత్రాన్ని కట్టడం అనేది దాంపత్య బంధానికి ప్రతీక. ఇది భార్య వివాహ స్థితిని సూచించే ఒక గుర్తు మాత్రమే. మంగళసూత్రాన్ని తీస్తే భర్త ఆయుష్షు తగ్గుతుందనే స్పష్టమైన వాక్యాలు ఎక్కడా లేవని పండితులు చెబుతున్నారు. భార్య భర్తల మధ్య ఉండాల్సిన ధర్మబద్ధమైన జీవితం, పరస్పర గౌరవం, నిబద్ధత గురించి మాత్రమే పురాణాలు బోధించాయని పండితులు చెబుతున్నారు. 

36
ఆ విషయం ఎక్కడా చెప్పలేదు

మంగళసూత్రాన్ని ఎప్పుడు, ఎందుకు తీస్తారు అనే అంశం కూడా ముఖ్యమే. ఆరోగ్య కారణాల వల్ల, శస్త్ర చికిత్స సమయంలో, ఉద్యోగ అవసరాల వల్ల లేదా భద్రతా కారణాల వల్ల చాలామంది మహిళలు మంగళసూత్రాన్ని తాత్కాలికంగా తీస్తుంటారు. పురాణాల ప్రకారం ఇది పాపంగా లేదా అపశకునంగా ఎక్కడా చెప్పలేదు. ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీ సౌభాగ్యం ఆమె మనస్సు, ప్రవర్తన, ధర్మాచరణతో ముడిపడి ఉంటుంది. కానీ ఒక ఆభరణాన్ని శరీరంపై ఉంచుకోవడమో లేక తీసివేయడంతోనో ఉండదని పండితులు చెబుతున్నారు.

46
బంధానికి గుర్తు

పండితుల ప్రకారం మంగళసూత్రం అనేది “భావాత్మక సంకేతం” మాత్రమే. అది భార్య భర్తల మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తుంది. భర్త ఆయుష్షు అనేది అతని కర్మ, ఆరోగ్యం, జీవనశైలి, దైవ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. భార్య మంగళసూత్రాన్ని తీస్తే భర్త ఆయుష్షు తగ్గుతుందనడం కర్మ సిద్ధాంతానికి విరుద్ధమని కొందరు పండితులు చెబుతున్నారు. ఒక వ్యక్తి జీవిత కాలాన్ని మరొకరి ఆభరణాలతో అనుసంధానం చేయడం శాస్త్రోక్తం కాదని వివరిస్తున్నారు.

56
కొన్ని ప్రాంతాల్లో..

అయితే కొన్ని ప్రాంతాల్లో మంగళసూత్రాన్ని ఎప్పుడూ మెడలో ఉంచుకోవాలనే ఆచారం ఉంది. దీనికి కారణం సామాజిక సంప్రదాయం మాత్రమే. కాలక్రమంలో ఈ ఆచారానికి భయాన్ని జతచేసి, “తీస్తే అపశకునం” అనే భావనను ప్రచారం చేశారు. వాస్తవానికి ఇవి పురాణాల నుంచి వచ్చిన నియమాలు కాదు, సమాజంలో ఏర్పడ్డ స్థానిక విశ్వాసాలు మాత్రమేనని పండితులు చెబుతున్నారు.

66
అవే అసలైన బలం..

నేటితరం పండితులు, తాత్వికులు ఈ అపోహను మరింత స్పష్టంగా ఖండిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, ఇలాంటి నమ్మకాలు మహిళల్లో అనవసరమైన భయాన్ని, మానసిక ఒత్తిడిని పెంచుతాయి. మంగళసూత్రం అనేది గౌరవించాల్సిన సంప్రదాయ చిహ్నమే కానీ, దాన్ని భయంతో ముడిపెట్టడం సరికాదు. స్త్రీకి భర్త పట్ల ప్రేమ, పరస్పర అవగాహన, కుటుంబ బాధ్యతలు ఉంటే చాలు. అవే దాంపత్య జీవితానికి అసలైన బలం అని పండితులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories