April Planetary Transit: ఏప్రిల్‌లో మేషరాశిలో ప్రధాన గ్రహాలు కలవబోతున్నాయి. శుక్రుడు, సూర్యుడు, బుధుడు మేష రాశిలోకి కలిసి నాలుగు గ్రహాలకు ఆకస్మిక ధనలాభాన్ని తెచ్చిపెడతాయి. జీవితంలో బోలెడన్ని ఆర్ధిక లాభాలను చూస్తారు.
ఏప్రిల్ నెలలో ప్రధాన గ్రహాల సంచారం జరగబోతోంది. ఏప్రిల్ 30న బుధుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంతకుముందే ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు. కుజుడు కూడా ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మేషరాశిలో మొత్తం మూడు గ్రహాలు కలిసి ఉంటాయి. ఇది రాశి చక్రంపై భారీ ప్రభావాన్నే చూపిస్తుంది. దీని వల్ల నాలుగు రాశుల వారికి కలిసివస్తుంది.
25
మేష రాశి
మేష రాశి వారికి ఈ శుభ గ్రహాల కలయిక ఆర్థికంగా లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ రాశి వారి ఆదాయం పెరగడంతో పాటు, కెరీర్‌లో ముందుకు వెళతారు. ఈ రాశు కలయిక వల్ల ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. దీని వల్ల ఈ రాశి వారి నిర్ణయాల్లో ఓపికగా ఉండాలి. నిజాయితీగా పనిచేయాలి. ఈ రాశిలో సూర్య, శుక్రుల కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.
35
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ మూడు గ్రహాల కలయిక వల్ల మంచి జరుగుతుంది. వ్యాపారం చేస్తున్న ఈ రాశి వారికి వృద్ధి బాగా కలిగే అవకాశం ఉంది. అయితే వీరు వారి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆమె ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. సూర్యుడు ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. ఇక శుక్రుడు సంపద, శ్రేయస్సును అందిస్తాడు. ఇది ఈ రాశి వారికి మంచి సమయం అనే చెప్పుకోవాలి.
ఈ మూడు గ్రహాల కలయిక వల్ల తులారాశి వారు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అయితే వీరి జీవితంలో ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఏదైనా పెట్టుబడి నుంచి మంచి లాభం పొందే అవకాశం ఉంది.
55
మీన రాశి
మీన రాశి వారికి మూడు గ్రహాల వల్ల జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏప్రిల్ మొదటి భాగంలో బుధ, సూర్య, కుజ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారు ఎంతో ప్రయోజనం పొందుతారు. మాళవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడి ఈ రాశి వారికి ఆకస్మికంగా లాభాలను తెచ్చిపెడతాయి.