Today Rasi Phalalu: ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో గొడవలు పెరిగే అవకాశం!

Published : Jun 24, 2025, 05:00 AM IST

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 24.06.2025 మంగళవారానికి సంబంధించినవి.

PREV
112
మేష రాశి ఫలాలు

మేష రాశివారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఈ రాశివారు వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు కలిసివస్తుంది. 

212
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారు కుటుంబ వ్యవహారాల్లో మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు మీ పట్ల గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

312
మిథున రాశి ఫలాలు

మిథున రాశివారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఈ రాశివారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు.

412
కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.

512
సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.  పిల్లల చదువు విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

612
కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

712
తుల రాశి ఫలాలు

తుల రాశివారికి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపడతారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

812
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశి వారు సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయట పడతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధుమిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

1012
మకర రాశి ఫలాలు

మకర రాశివారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. అధికారుల సపోర్ట్ దక్కుతుంది. 

1112
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు దక్కవు. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. జీవితంలో నిరాశ, ఒత్తిడి పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

1212
మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రాశివారు చిన్ననాటి మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.  

Read more Photos on
click me!

Recommended Stories