Zodiac Signs : మహాలయ అమావాస్యతో మారనున్న జాతకం.. ఈ 4 రాాశువారికి ఇక రాజయోగమే..!

Published : Sep 21, 2025, 01:24 PM IST

Zodiac Signs : నేడు పితృ అమావాస్య… ఈ రోజున అనేక శుభ యోగాలు ఏర్పడటం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది.కొన్ని రాశులవారికి పూర్వీకుల ఆశీర్వాదాల వల్ల శుభ యోగాలు, ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాంటి రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
15
మహాలయ అమావాస్యతో ఈ రాశులవారికి రాజయోగమే

Zodiac Signs : నేడు మహాలయ అమావాస్య… దీన్నే పెద్దల అమావాస్య లేదా పెత్ర అమావాస్య అనికూడా అంటాయి. ఈరోజు పితృదేవతలకు అంటే పూర్వీకులకు సాంప్రదాయబద్దంగా పిడప్రదానం, పూజలు చేస్తే వారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అందుకే చాలామంది నదీస్నానం చూసి తమ పెద్దలకు నైవేద్యం సమర్పించి ఆశీర్వాదం కోరతారు.

అయితే జ్యోతిష్యుల ప్రకారం కూడా ఈ మహాలయ అమావాస్య కొన్ని రాశులవారికి బాగా కలిసివస్తుంది. నేడు(ఆదివారం) శుభ, శుక్ల, సర్వార్థ సిద్ధి, గజకేసరి యోగాలు ఏర్పడ్డాయి. ఈ యోగాల వల్ల కొన్ని రాశుల వారి పనులు పూర్తయి, వారి పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు. దీనివల్ల వారికి అనుకోని రాజయోగం కలుగుతుంది… ఆ రాశులేవి ఇక్కడ తెలుసుకుందాం.

25
తులా రాశి

తులా రాశి వారు ఇవాళ ఆనందం, శ్రేయస్సు పొందుతారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి.. కొత్త కెరీర్ మార్గాలు తెరుచుకుంటాయి. వైవాహిక బంధాలు బలపడతాయి. పూర్వీకులకు తర్పణాలు ఇవ్వడం వల్ల కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. వీరికి రాజయోగం ప్రారంభం అవుతుంది.

35
మిథునరాశి

సర్వ పితృ అమావాస్య మిథున రాశి వారికి చాలా శుభప్రదం. గత కొన్నేళ్ళుగా ముందకు సాగకుండా నిలిచిపోయిన పనులలో పురోగతి కనిపిస్తుంది. పూర్వీకుల ఆశీస్సులతో కెరీర్ స్థిరంగా ఉండి, కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఉద్రిక్తతలు తగ్గుతాయి. పిల్లల గురించిన చింతలు తీరతాయి. కుటుంబపరంగానే కాదు కెరీర్ పరంగాను అంతా మంచే జరుగుతుంది.

45
కుంభ రాశి

సర్వ పితృ అమావాస్య రోజున ఈ రాశి వారి అదృష్టం బాగుంటుంది. పూర్వీకుల ఆశీస్సులతో విదేశీ ప్రయాణ అవకాశాలు రావచ్చు. ఆధ్యాత్మిక ఆసక్తులు పెరిగి మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆర్థిక లాభం కూడా సాధ్యమే.

55
కన్యారాశి

ఈసారి కన్యా రాశి వారు పూర్వీకుల ఆశీస్సులతో గొప్ప ప్రయోజనాలు పొందుతారు. వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు, భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశివారికి కుటుంబ కలహాలు కూడా తొలగిపోతాయి. పూర్వీకుల ఆశిస్సులతో ఆర్థికంగా కూడా లాభపడతారు.

Read more Photos on
click me!

Recommended Stories