Zodiac Signs: రెండు రోజులు ఓపిక పడితే చాలు.. ఈ నాలుగు రాశులకు డబ్బే డబ్బు!

Published : Jul 24, 2025, 01:49 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు అంతకంటే ఎక్కువ గ్రహాలు కలిసి రాజయోగాలు ఏర్పరుస్తుంటాయి. త్వరలో కుజుడు, చంద్రుడు కలిసి మహాలక్ష్మీ రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి విశేష ఫలితాలు ఉంటాయి. ఆ రాశులేంటో చూద్దాం. 

PREV
15
మహాలక్ష్మీ రాజయోగం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 26న చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న కుజుడితో కలిసి మహాలక్ష్మి రాజయోగాన్ని సృష్టిస్తాడు. ఈ యోగం వల్ల 4 రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు జరగనున్నాయి. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఏ రాశులవారికి మంగళ, చంద్రుల కలయిక శుభప్రదమో ఇక్కడ చూద్దాం.  

25
మేష రాశి

మహాలక్ష్మి రాజయోగం మేష రాశి వారికి ఆదాయాన్ని పెంచుతుంది. జూలై తర్వాత వృత్తిపరంగా ప్రగతి ఉంటుంది. అనేక మార్గాల ద్వారా ధన లాభం కలుగుతుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వారు భవిష్యత్తులో ఉపయోగపడతారు. ప్రేమ జీవితంలో కూడా శుభ ఫలితాలుంటాయి. ఈ రాజయోగం ప్రేమ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

35
మిథున రాశి

మిథున రాశి వారికి మంగళ, చంద్రుల కలయిక శుభప్రదం. ఈ రాశివారు ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగలుగుతారు. వ్యాపారులకు గతంలో చేసిన కృషికి మంచి ఫలితాలుంటాయి. కొందరు వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  

45
సింహ రాశి

సింహ రాశి వారికి మహాలక్ష్మి యోగం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృత్తిలో మంచి మార్పులుంటాయి. మీ పనితీరుకు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సైన్యం, పోలీసు శాఖల్లో పనిచేసేవారికి పదోన్నతి లభించవచ్చు. క్రీడల్లో రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. గతంలో చేసిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. మీ ఆలోచనలతో అందరినీ ప్రభావితం చేస్తారు.

55
తుల రాశి

తుల రాశి వారు చంద్ర, మంగళ గ్రహాల కలయిక వల్ల కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడికి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తారు. ఆర్థిక సమస్యలు తీరతాయి. కొందరికి ఉద్యోగం లభించవచ్చు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories