మీన రాశి వారికి చంద్రుడు, మంగళుడు కలయికతో ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం ప్రత్యేకమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రెండు గ్రహాల అనుకూలత వల్ల గతంలో ఎదురైన సమస్యలు ఇప్పుడు పరిష్కారం అయ్యే అవకాశముంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలోనూ, కుటుంబంలోనూ ఎదురయ్యే వివాదాలు పరిష్కారమవుతాయి. కేతువు ఆరవ ఇంటిలో ఉండటంతో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
అంతేగాక ఐదవ ఇంటిలో బుధాదిత్య యోగం ఉండటంతో మీ మానసిక స్థితి బలపడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులు విదేశాల నుంచి ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు.