Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లాడితే.. మీ లైఫే మారిపోతుంది

Published : Jul 25, 2025, 04:45 PM IST

కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. భర్తలకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా…  

PREV
16
Birth Date

జోతిష్యశాస్త్రం మాదిరిగానే.. న్యూమరాలజీ ప్రకారం మనం మన భవిష్యత్తు తెలుసుకోవచ్చు. కాగా, న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన అమ్మాయిలు.. పెళ్లి తర్వాత తమ భర్తకు అదృష్టాన్ని మోసుకువస్తారు. మరి ఆ తేదీలేంటో చూద్దామా….

26
5వ తేదీ...

ఏ నెలలో అయినా  5వ తేదీన పుట్టిన స్త్రీలు భర్తకు అదృష్టాన్ని మోసుకొస్తారు.  ఈ తేదీలో పుట్టిన స్త్రీలపై బుధ గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఈ స్త్రీలు చాలా వేగంగా నిర్ణయం తీసుకుంటారు. వీరు చాలా చురుకుగా ఉంటారు. ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత వారి భర్త జీవితం ఆర్థికంగా, వృత్తి పరంగా  మంచి పురోగతి సాధిస్తారు. భర్త అభివృద్ధికి ఈ స్త్రీలు తోడ్పడతారు. వీరు అడుగుపెట్టిన తర్వాత అత్తగారి కుటుంబం మరింత ఆనందంగా మారుతుంది. 

36
14వ తేదీ..
1+4=5. వీరు కూడా బుధుని ప్రభావం కలిగి ఉంటారు. 5వ తేదీన పుట్టినవారి లక్షణాలు, అదృష్టాలు వీరికి కూడా ఉంటాయి. భర్తల సామాజిక స్థాయి, పలుకుబడి పెరగడానికి వీరు కారణం అవుతారు. కుటుంబంలో సానుకూల శక్తిని నింపే శక్తి వీరి సొంతం. ఏ క్లిష్ట పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనే నేర్పు కలిగి ఉంటారు. ఈ స్త్రీలు భర్తకు వృత్తిపరంగా చాలా సలహాలు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతారు.
46
23వ తేదీ..
2+3=5. ఈ తేదీన పుట్టినవారు కూడా బుధుని ప్రభావం కలిగి ఉంటారు. వీరు జీవితంలో ఏదీ సులభంగా పొందలేరు. కష్టపడి సాధించాలనే తపన కలిగి ఉంటారు. భర్త జీవితంలో పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తారు. అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలనే తపన కలిగి ఉంటారు. దీనివల్ల భర్తకు ఏ పరిస్థితిలోనైనా మద్దతుగా నిలుస్తారు. వీరి నాయకత్వ లక్షణాలు, నిర్వహణ నైపుణ్యాలు కుటుంబానికి మంచి మార్గదర్శకంగా ఉంటాయి.
56
6వ తేదీ
ఆరవ తేదీన పుట్టిన స్త్రీలు శుక్రుని ప్రభావం కలిగి ఉంటారు. శుక్రుడు ఐశ్వర్యం, విలాసం, కళలు, ఆనందం, ప్రేమకు అధిపతి. ఈ తేదీన పుట్టిన స్త్రీలు కుటుంబంలో ఆనందం, శాంతిని కలిగిస్తారు. భర్తకు మంచి సహాయకులుగా ఉంటారు. భర్త వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. దీనివల్ల విలాసవంతమైన సౌకర్యాలు, ధనసంపద పెరుగుతాయి. భర్త, కుటుంబంపై అపారమైన ప్రేమ కలిగిన వీరిని వివాహం చేసుకునే పురుషుల జీవితం ఆనందంగా ఉంటుంది.
66
15వ తేదీ..

1+5=6. వీరు కూడా శుక్రుని ప్రభావం కలిగి ఉంటారు. 6వ తేదీన పుట్టినవారి లక్షణాలు, అదృష్టాలు వీరికి కూడా ఉంటాయి. భర్త వ్యాపారంలో విజయం సాధించడానికి కృషి చేస్తారు. భర్తకు అవసరమైన అన్ని మద్దతు, ప్రోత్సాహం అందిస్తారు. వీరి రాక భర్తల జీవితంలో కొత్త వెలుగు, అదృష్టాన్ని తెస్తుంది. 

(గమనిక: ఈ సంఖ్యాశాస్త్ర భావనలు నమ్మకం మీద ఆధారపడినవి మాత్రమే. ఒకరి జీవితం, అదృష్టం, సంబంధాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత లక్షణాలు, ఇద్దరి మధ్య అవగాహన, ప్రేమ, కష్టపని, జీవిత పరిస్థితులు వైవాహిక జీవితంలో విజయం, అదృష్టాన్ని నిర్ణయించే ముఖ్య అంశాలు. పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్‌లో లభించే సాధారణ సమాచారం ఆధారంగా మాత్రమే తీసుకున్నాం. ఏ విధమైన మూఢనమ్మకాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదు. ఈ భావనలకు ఆసియా నెట్ తెలుగు బాధ్యత వహించదు.)

Read more Photos on
click me!

Recommended Stories