RajaYogam: దసరాకి మహాలక్ష్మి రాజయోగం, ఈ 3 రాశులకు విపరీతమైన ధనప్రాప్తి

Published : Sep 09, 2025, 11:34 AM IST

ఈ ఏడాది నవరాత్రులకు మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. దీని వల్ల  కొన్ని రాశుల వారి జీవితాల్లో ఎంతో మార్పులు వస్తాయి. వారికి ఆర్థికంగా విపరీతంగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

PREV
15
మహాలక్ష్మి రాజయోగం 2025

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, వాటి  కలయికలు పన్నెండు రాశులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. తద్వారా ఆ రాశుల్లో జన్మించిన వారిపై శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. రెండు గ్రహాలు కలిసినప్పుడు ఏర్పడే రాజయోగం కొన్ని రాశుల వారికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్రతాలు, పండుగల సమయంలో ఏర్పడే ప్రత్యేక రాజయోగాలు కొన్ని రాశుల వారికి అధిక ప్రయోజనాలను చేకూరుస్తాయి. దసరాకు ముందు నవరాత్రుల సమయంలో ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం చాలా శుభప్రదమైనదిగా చెప్పుకుంటారు. 

25
చంద్రుడు కుజుడి కలయికతో

ఏడాది దసరాకు ముందు వచ్చే నవరాత్రుల సమయంలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది.  సెప్టెంబర్ 22, 2025న ప్రారంభమై అక్టోబర్ 2, 2025న నవరాత్రులు ముగుస్తాయి. అక్టోబర్ 2న దసరా పండుగ. నవరాత్రుల సమయంలో, సెప్టెంబర్ 24న చంద్రుడు తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. తుల రాశిలో ఇప్పటికే కుజుడు ఉన్నందున, ఈ రెండు గ్రహాల కలయిక ప్రత్యేకమైన, శుభప్రదమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

35
తుల

తుల రాశి వారి లగ్నంలో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల తులా రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. దీని వల్ల మీ ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు ధైర్యంగా, స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. కుటుంబంలో అపారమైన ఆనందం ఉంటుంది. దీని వల్ల మీరు మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఒంటరిగా ఉన్నవారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం అన్నింటిలోనూ అభివృద్ధిని చూస్తారు.

45
మకరం

మకర రాశి వారి కర్మ స్థానంలో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల వీరికి వృత్తి,  వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. పదోన్నతి, జీతం పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు కూడా పెద్ద లాభాలు పొందవచ్చు. కొత్త ఒప్పందాల ద్వారా లాభాలు రెట్టింపు అవుతాయి.  వ్యాపారపరంగా చేసే పర్యటనలు విజయవంతమవుతాయి. మీ సామాజిక స్థాయి పెరుగుతుంది. 

55
కుంభం

కుంభ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అదృష్టాన్ని అందిస్తుంది. ఈ యోగం తొమ్మిదవ స్థానమైన భాగ్య స్థానంలో ఏర్పడుతుంది. దీని వల్ల అదృష్టం ద్వారా పూర్తి మద్దతు లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో వరుసగా శుభకార్యాలు జరుగుతాయి. ఆఫీసులో పనిచేసేవారికి పదోన్నతులు లభిస్తాయి. దీని వల్ల జీతం పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని అనుకునేవారి కోరిక నెరవేరుతుంది. 

(Disclaimer: ఈ కథనంలోని సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య అభిప్రాయాలు, పంచాంగం, మత గ్రంథాలపై ఆధారపడి ఉంటుంది. దీని ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఫలితాలకు Asianet News తెలుగు బాధ్యత వహించదు. ఈ సమాచారాన్ని Asianet News తెలుగు ధృవీకరించలేదు)

Read more Photos on
click me!

Recommended Stories