Mercury Transit: బుధుని వల్ల శక్తివంతమైన భద్ర యోగం, ఈ రాశుల వారికి మంచి రోజులు మొదలు

Published : Sep 09, 2025, 09:17 AM IST

బుధుడి వల్ల భద్రయోగం ఏర్పడబోతోంది. సెప్టెంబరు 16 నుంచి అక్టోబరు 2 వరకు బుధ గ్రహం కన్యారాశిలోనే ఉంటుంది. దీని వల్లే శక్తివంతమైన భద్రయోగం కలుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీత రాజయోగం దక్కుతుంది.  

PREV
16
సింహ రాశి

సింహరాశి వారికి బుధుడు ధన స్థానంలో ఉంటాడు. దీని వల్ల  వీరికి ఆదాయం పెరుగుతుంది. షేర్లలో పెట్టిన పెట్టుబడులపై విపరీతమైన లాభాలు వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది.  వీరి జీవితంలో ఉన్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. 

26
కన్యా రాశి

బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల కన్యా రాశిలోనే భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారు తమ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం. వీరి సంపద కూడా పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుండి వీరికి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు చాలా వరకు తీరిపోతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వస్తాయి. 

36
వృశ్చిక రాశి

బుధుడు లాభ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారికి  అంతా శుభమే జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.

46
ధనూ రాశి

ధనూ రాశి వారికి  పదవ స్థానంలో బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది. దీని వల్ల వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది.  ఉద్యోగస్తులకు కొత్త అధికారాలు వస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఆదాయం అంచనాలను మించి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది.

56
మకర రాశి

భాగ్య స్థానంలో బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల సామాన్యులు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉండవచ్చు. జీతం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కుటుంబ, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

66
మీన రాశి

బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తిగా ఈ రాశి వారికి గుర్తింపు లభిస్తుంది. ఏ రంగంలోనైనా హోదా, గౌరవం పెరుగుతాయి. ధనవంతులు లేదా ప్రభావవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమించే లేదా వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories