కన్య రాశి అధిపతి బుధుడు, దీనిని గ్రహాల యువరాజు అంటారు. బుద్ధి, జ్ఞానం, తార్కిక శక్తికి కారణమైన బుధుడు కన్య రాశికి ప్రత్యేకంగా అనుగ్రహిస్తాడు. ఈ రాశి వారు తెలివైనవారు. తమను తాము మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ, కృషి చేస్తారు. గాలి మాటలు మాట్లాడటం ఇష్టపడరు. నిర్ణయాలు తీసుకోవడంలో, ఏ సమస్య నుండైనా బయటపడటంలో వారి తెలివితేటలు చాలా ఉపయోగపడతాయి.