కొంత మంది పురుషులు అన్నింట్లో ముందుంటారు. వారు ఏ రంగంలో అడుగు పెట్టినా విజయం సాధిస్తారు. ఇంతకీ వారి అదృష్టానికి రహస్య ఏంటి.? పండితులు ఏం చెబుతున్నారు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పండితుల అభిప్రాయం ప్రకారం సముద్ర శాస్త్రం, ధర్మ గ్రంథాల్లో పలు విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని రకాల లక్షణాలున్న పురుషులు అన్ని రంగాల్లో రాణిస్తుంటారు, ఆర్థికంగా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడమ కాలి బొటన వేలు పెద్దగా ఉంటే అది అదృష్టానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణం ఉన్న పురుషులు ఆర్థికంగా ముందంజలో ఉంటారు.
విశాలమైన నుదురు ఉన్న పురుషులు కూడా చాలా అదృష్టవంతులని పండితులు చెబుతున్నారు. ఇలాంటి పురుషులు లోతైన ఆలోచనలు, దూరదృష్టి కలిగి ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఛాతీపై వెంట్రుకలు ఉండే పురుషులు కూడా చాలా అదృష్టవంతులని పండితులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో ధైర్యం, బలం, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయని శాస్త్రాల్లో పేర్కొన్నారు.
ఇలా అరచేతిలో M గుర్తు ఉన్న పురుషుల్లో అంతర్ దృష్టి, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇలాంటి పురుషుల్లో ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆర్థికంగా ఎప్పుడూ పెద్దగా సమస్యలు రావని అంటున్నారు.
గమనిక..
గమనిక: పైన తెలిపిన వివరాలు భవిష్య పురాణం, సముద్ర శాస్త్రం వంటి శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.