వీటితోపాటు..
ఇక కలలో ఏదైనా పండు తింటున్నట్లు కనిపిస్తే. అది డబ్బు ప్రవాహానికి సూచికగా భావించాలని పండితులు చెబుతున్నారు. పాతిపెట్టిన బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను కలలో కనిపిస్తే ఆర్థికంగా ఢోకా ఉండదని అర్థం చేసుకోవాలి.
కలలో పండిన గోధుమ కనిపిస్తే శుభప్రదంగా చెబుతున్నారు. ఆర్థికంగా మీరు పురోగమించనున్నారని అర్థం చేసుకోవాలి. కలలో అప్పు ఇస్తున్నట్లు కనిపిస్తే మీకు రావాల్సిన డబ్బు వస్తుందని అర్థం. కలలో వజ్రాలు , ఆభరణాలను చూడటం లక్ష్మీ దేవి అనుగ్రహానికి సూచికగా చెబుతుంటారు.
డబ్బుల విషయంలో ఎలంటి ఢోకా ఉండదని అర్థం. కలలో కుండలు తయారు చేస్తున్నట్లు కనిపించినా మంచికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు.