Birth Date: పుట్టిన తేదీ ప్రకారం బర్త్ డే నాడు ఏ రంగు డ్రెస్ వేసుకుంటే మంచిదో తెలుసా?

Published : Jun 29, 2025, 03:03 PM IST

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీని బట్టి వ్యక్తుల భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. వారికి  ఏది మంచిది? ఏది కాదో నిర్ణయించవచ్చు. మరి జన్మ తేదీ ప్రకారం బర్త్ డే నాడు ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
111
పుట్టినరోజుకు ఏ రంగు దుస్తులు ధరిస్తే లక్?
సంఖ్యా శాస్త్రం ప్రకారం..

సంఖ్యాశాస్త్రం ప్రకారం జన్మ తేదీని బట్టి వ్యక్తుల జీవితాలకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. వారు భవిష్యత్తులో ఏం చేస్తారు? వారి జీవితం ఎలా ఉంటుంది? వంటి విషయాలు చెప్పవచ్చు. మరి పుట్టిన తేదీని బట్టి.. బర్త్ డే నాడు ఏ రంగు దుస్తులు వేసుకోవడం మంచిదో ఇక్కడ చూద్దాం.  

211
బర్త్ డే నాడు ఏ రంగు డ్రెస్ వేసుకుంటే మంచిది?

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక్కో తేదీలో పుట్టిన వారు ఒక్కో లక్షణం కలిగి ఉంటారు. వారి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు భిన్నంగా ఉంటాయి. జన్మ తేదీ ప్రకారం వారికి కలిసి వచ్చే కొన్ని రంగులు ఉంటాయి. ఆ రంగులు వారి జీవితంలో సంతోషం, విజయ అవకాశాలను సృష్టించడానికి సహాయపడతాయి. మరి పుట్టిన తేదీ ప్రకారం పుట్టిన రోజున ఏ రంగు బట్టలు ధరించడం మంచిదో ఇక్కడ తెలుసుకుందాం

311
1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు.. బర్త్ డే నాడు ఆరెంజ్ కలర్ దుస్తులు వేసుకోవడం మంచిది. ఈ రంగు దుస్తులు మీ జీవితంలో అదృష్టాన్ని, ఆనందాన్ని తీసుకువస్తాయి. జ్యోతిష్యం ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారిపై కుజుడి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ తేదీల్లో జన్మించిన వారికి ఈ రంగు శుభప్రదం అని నమ్మకం.

411
2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారు..

ఏ నెలలో అయినా.. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు పుట్టిన రోజున.. సిల్వర్ కలర్ లేదా ఆకుపచ్చ దుస్తులు ధరించడం శుభప్రదం. ఈ తేదీల్లో పుట్టినవారిపై బుధ, శుక్రుల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రంగులు వారికి మంచి ఫలితాలను ఇస్తాయి.  
 

511
3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు.. బర్త్ డే నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరిపై గురువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. అన్నిచోట్లా విజయం దక్కుతుంది.  

611
4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు

ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు బూడిద రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. పుట్టినరోజున వీరు బూడిద రంగు దుస్తులు ధరిస్తే.. భవిష్యత్తులో శుభం కలుగుతుంది. బర్త్ డే నాడే కాదు.. ఇతర శుభ దినాల్లో కూడా ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి మంచి జరుగుతుంది.

711
5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు.. లేత ఆకుపచ్చ, నీలం రంగులను ధరించడం మంచిది. దానివల్ల మీ జీవితంలో ఎప్పుడూ శ్రేయస్సు ఉంటుంది. ఆనందంగా ఉంటారు.

811
6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు..

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు పుట్టినరోజున నీలం రంగు దుస్తులు ధరించవచ్చు. ముఖ్యంగా ముదురు నీలం రంగు మంచిది. నీలం రంగు దుస్తులు ఎప్పుడూ మీ జీవితంలో విజయ అవకాశాలను పెంపొందిస్తాయి.

911
7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు..

7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు.. తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. దీనివల్ల వారికి అంతా శుభం జరుగుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.  

1011
8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు..

మీరు 8, 17, 26 తేదీల్లో జన్మించి ఉంటే.. మీ పుట్టినరోజున ముదురు నీలం, ముదురు ఊదా లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం. 

1111
9,18, 27 తేదీల్లో పుట్టిన వారు..

సంఖ్యా శాస్త్రం ప్రకారం 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు.. పుట్టిన రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories