
ఇతరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మిత్రుల నుంచి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.
ప్రయాణాల్లో శ్రమ పెరుగుతుంది. బంధువర్గంతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది.
దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల చికాకు తెప్పిస్తాయి.
వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవసరానికి సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల తిప్పలు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
స్థిరాస్తి వివాదాలు మరింత బాధిస్తాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలకు సంబంధించి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం కలుగుతుంది. దైవచింతన పెరుగుతుంది.
విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేస్తారు. రాజకీయ వర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.
బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కొత్త అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
ఉద్యోగులు విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.