విజయదశమి తర్వాత కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. వారి కష్టాలు తీరిపోనున్నాయి. జ్యోతిష్యపరంగా దసరా పండుగ చాలా ముఖ్యమైనది. నేడు తులారాశిలో బుధ, కుజ గ్రహాల అరుదైన కలయిక జరగబోతోంది. దీని వల్ల 50 ఏళ్లకు ఒకసారి ఏర్పడే అద్భుతమైనకాలం రాబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక తులారాశిలో జరగడం వల్ల డబ్బు, సంబంధాలపై ప్రభావం పడుతుంది. దసరా రోజున సరస్వతి పూజ, ఆయుధ పూజ చేయడం అదృష్టాన్ని మరింత పెంచుతుంది.