నెంబర్ 7..
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి జ్ఞానం చాలా ఎక్కువ. వీరికి తెలివి తేటలు కూడా చాలా ఎక్కువ. వారి తెలివి తేటలతోనే ఎక్కువ డబ్బు సంపాదించగలరు. తెలివిగా పెట్టుబడులు పెట్టి.. మంచి లాభాలు పొందుతారు. వ్యాపార నిర్ణయాలు కూడా చాలా తెలివిగా తీసుకుంటారు.
నెంబర్ 8...
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే ఆర్థిక వ్యూహరచన చేయగల నిపుణులు. వీరు పెద్ద ఆర్థిక ప్రాజెక్టులను సక్సెస్ ఫుల్ గా నడిపించగలరు. మంచి భవిష్యత్తును పొందుతారు.