Kubera Yogam: గురు, కేతువుల కలయికతో కుబేర యోగం.. ఈ 5 రాశులవారిని ఎవ్వరూ ఆపలేరు!

Published : Oct 15, 2026, 02:01 PM IST

Kubera Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. త్వరలో గురు, కేతువుల కలయిక జరగనుంది. దీనివల్ల కొన్ని రాశులవారి దశ మారనుంది. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపారాల వరకు ఊహించని లాభాలు కలగనున్నాయి. మరి దసరా తర్వాత ఏ రాశులవారికి అదృష్టం పట్టనుందో ఇక్కడ చూద్దాం.

PREV
16
కుబేర యోగంతో లబ్ధి పొందే రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు భగవానుడు సంపద, జ్ఞానం, విద్య, వివాహం, అదృష్టానికి కారకుడు. ధనుస్సు, మీన రాశులకు అధిపతి అయిన గురువు జాతకంలో మంచి స్థానంలో ఉంటే జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయి. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న గురువు అక్టోబర్ 31న సింహ రాశిలోకి మారనున్నాడు. అక్కడ ఇప్పటికే ఉన్న కేతువుతో గురువు కలుస్తాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారి ఆర్థిక పరిస్థితి, కెరీర్, వ్యక్తిగత జీవితంలో భారీ మార్పులు వస్తాయి. కేతువు ఆధ్యాత్మికత, ఊహించని మార్పులకు సంకేతం. గురు, కేతువుల కలయిక వల్ల ఏయే రాశులకు కొత్త అవకాశాలు, ఆదాయం పెరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

26
మకర రాశి

మకర రాశి వారికి గురు, కేతువుల కలయిక చాలా మంచి మార్పులు తెస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు చాలా క్లారిటీతో తీసుకుంటారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు చేతికి వస్తాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి జీతంతో కొత్త జాబ్ వస్తుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో కొత్త ప్లాన్స్ అమలు చేసి లాభాలు పొందుతారు.

36
మిథున రాశి

మిథున రాశి వారికి ఈ గ్రహాల కలయిక కెరీర్, డబ్బుల విషయంలో కొత్త దారులు చూపిస్తుంది. ఇప్పటివరకు మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుంది. జీవితంలో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లే ఛాన్స్ వస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెంచుకోవాలి అనుకునే వారికి కొత్త ప్రయత్నాలు బాగా కలిసొస్తాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి, విద్యార్థులకు ఈ టైమ్ చాలా బాగుంటుంది.

46
తుల రాశి

తుల రాశి వారికి గురు, కేతువుల కలయిక ఆర్థికంగా మంచి లాభాలు తెస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇది కరెక్ట్ టైమ్. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు వస్తారు. లాభాలు తెచ్చే అగ్రిమెంట్లు కుదురుతాయి. దీనివల్ల ఆదాయం అమాంతం పెరుగుతుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు వస్తాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

56
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ గ్రహాల కలయిక కొత్త ఆశలు, అవకాశాలు ఇస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు, వాటి నుంచి మెల్లగా బయటపడతారు. వ్యాపారులకు ఊహించని అవకాశాలు వస్తాయి. పాత ప్లాన్స్ ద్వారా ఇప్పుడు లాభాలు చూస్తారు. కొత్త కస్టమర్లతో పరిచయాలు పెంచుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా కొత్త జాబ్ ఆఫర్స్ వస్తాయి. ఎప్పటి నుంచో ఉన్న కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.

66
వృషభ రాశి

వృషభ రాశి వారికి గురు, కేతువుల కలయిక డబ్బు, కెరీర్ పరంగా కొత్త మార్పులు తెస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి. ఊహించని మార్గాల్లో ఆదాయం వస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఇస్తారు. జీతం పెరగడం లేదా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ కష్టానికి తగిన గుర్తింపు దొరుకుతుంది. వ్యాపారులకు కొత్త అగ్రిమెంట్లు కుదురుతాయి. బిజినెస్ పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి మంచి అవకాశాలు వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories