
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
చేపట్టిన పనులు ముందుకు సాగవు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం అవుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులకు అధికారులతో చర్చలు ఫలించవు.
చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. డబ్బు వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంట్లో కొందరి మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.
దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది.
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతులు పెరుగుతాయి. సంతాన వివాహ విషయం గురించి ప్రస్తావన వస్తుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.
నిరుద్యోగులకు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.
కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్థలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
భూ క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇతరుల నుంచి విమర్శలు తప్పవు. వృథా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.
సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
భూ సంబంధిత వ్యవహారాల్లో వివాదాలు చికాకు పరుస్తాయి. సంతానంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార భాగస్వాముల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.