Zodiac sign: తులా రాశిలోకి చంద్రుడు.. కుబేర యోగంతో 6 రాశుల వారి జాత‌కం మార‌డం ఖాయం.

Published : Sep 23, 2025, 12:49 PM IST

Zodiac sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారాలు, వాటి యుతులు కొన్ని ప్రత్యేక యోగాలను సృష్టిస్తాయి. వ‌చ్చే మూడు రోజులు అలాంటి ఓ యోగ‌మే రానుంది. దీంతో 6 రాశుల వారిపై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంద‌ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

PREV
17
కుబేర యోగం

ఈ నెల సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశించి కుజుడితో యుతి చెందుతున్నాడు. అదే సమయంలో గురుడు ఈ యోగంపై పంచమ దృష్టి సారించడం వల్ల అపూర్వమైన “కుబేర యోగం” ఏర్పడుతోంది. దీని ప్రభావం మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి క‌లిసొస్తుంది.

27
మేషరాశి వారికి ప‌ట్టింద‌ల్లా బంగారం

రాశ్యధిపతి కుజుడు, చంద్రుడు కలిసి ఉండటం, వాటిని గురుడు దృష్టిచేయడం వల్ల మేషరాశివారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఊహించని స్థలాల నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు, షేర్ల లావాదేవీలు లాభాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో కూడా ఆదాయం రెట్టింపవుతుంది. అప్పులు సులభంగా తీర్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి.

37
మిథునరాశి వారికి లాభాల వర్షం

ఈ రాశిలో గురువు సంచారం చేస్తూ చంద్ర మంగళ యోగాన్ని బలపరుస్తున్నాడు. దాంతో మిథున రాశివారు తమ ప్రతిభ, నైపుణ్యాలను ఉపయోగించి కొత్త ఆదాయ మార్గాలను పొందుతారు. షేర్లు, పెట్టుబడులు, భూ సంబంధ లావాదేవీల్లో లాభాలు దక్కుతాయి. ఆస్తి కొనుగోలు, విక్రయాల్లో కూడా శుభ ప్రభావం ఉంటుంది.

47
కన్యరాశి వారికి పదోన్నతులు, ఆస్తి లాభం

కన్యరాశివారికి ఈ యోగం ఉద్యోగరంగంలో శుభవార్తలు అందిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి, ఉన్నత హోదాలు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు రావచ్చు. కుటుంబ ఆస్తి సంబంధ వివాదాలు సానుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో అనూహ్యంగా లాభాలు వస్తాయి.

57
తులారాశి వారికి సంపద వృద్ధి ఖాయం

తులారాశిలోనే చంద్ర మంగళ యోగం ఏర్పడుతుండటంతో, ఈ రాశివారికి అది మరింత శక్తివంతంగా పని చేస్తుంది. గురువు భాగ్యస్థానం నుంచి దృష్టి సారించడం వల్ల ఆదాయ వృద్ధి ఖాయం అవుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరగడం, వ్యాపార ఒప్పందాలు కుదరడం, పెట్టుబడులు లాభాలు ఇస్తుంది. ఊహించని స్థలాలనుంచి సొమ్ము దక్కే అవకాశం ఉంది.

67
ధనుస్సు రాశి వారు

ఈ రాశివారికి లాభ స్థానంలో ఏర్పడిన చంద్ర మంగళ యోగం గొప్ప ఫలితాలను ఇస్తుంది. అనూహ్యంగా రావలసిన సొమ్ము చేరుతుంది. షేర్ల లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి.

77
కుంభ రాశి

కుంభరాశివారికి ఈ యోగం అప్రయత్న ధనప్రాప్తి కలిగిస్తుంది. ఉద్యోగరంగంలో జీతాలు పెరుగుతాయి. పెట్టుబడులు, మదుపులు బలమైన ఫలితాలు ఇస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories