Bad Zodiac signs: ఈ 4 రాశులవారికి చెడు లక్షణాలు ఎక్కువ, పగ పట్టారంటే అంతే సంగతులు

Published : Dec 07, 2025, 06:01 AM IST

Bad Zodiac signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి మంచి కన్నా చెడు లక్షణాలే ఎక్కువ ఉంటాయి. ఈ రాశుల వారిలోని నెగిటివిటీ, చెడు గుణాలు వాళ్లపైనే కాదు వారితో పాటు ఉండే వారిపై కూడా ప్రభావం చూపిస్తుందో. ఆ రాశులేవో తెలుసుకోండి.

PREV
15
జన్మ రాశిని బట్టి

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిత్వం, భవిష్యత్తును నిర్ణయించేందుకు జన్మరాశి ఎంతో ముఖ్యమైనది. పుట్టిన రాశిని బట్టి వారు ఎలాంటి వారో అంచనా వేసి చెప్పవచ్చని జ్యోతిషనిపుణులు చెబుతున్నారు.  ప్రతి రాశికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ఒక రాశిలో పుట్టిన వ్యక్తుల ఎలా మంచి గుణాలు, చెడు గుణాలు ఉంటాయో అంచనా వేయవచ్చు.  ఏ గుణం బలంగా ఉందనే దానిపై ఆ వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం ఆధారపడి ఉంటాయి.

25
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ప్రతికూల గుణాలు ఎక్కువ. వీరి నుంచి ప్రతికూల శక్తి అధికంగా ప్రసరిస్తుంది. కానీ ప్రతికూల శక్తి ఇతరుల కంటే వారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. వారు తమకు ఏదీ మంచి జరగదని తమలో తామే భావిస్తారు. అదే బలంగా నమ్ముతారు. అందుకే ఎప్పుడూ ప్రతికూల ఆలోచనల్లో మునిగిపోతారు. సంతోషంగా ఉన్నా కూడా తర్వాత ఏం ప్రమాదం వస్తుందోనని భయపడతారు. కర్కాటక రాశి వారు తమకు జరిగే చెడుకే కాదు  తమ చుట్టూ ఉన్నవారికి జరిగే చెడు విషయాలకు కూడా బాధపడతారు. ఆ బాధ్యతను కూడా తామే తీసుకుంటారు.

35
కన్యా రాశి

కన్యారాశి వారు ఎప్పుడూ తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. స్వీయ విమర్శలు చేసుకుంటారు. ప్రతికూల ఆలోచనలతో నిండి ఉంటారు.  వారి విమర్శనాత్మక దృష్టి ఇతరులపైనా కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇతరులను బాధపెట్టేలా వీరి మాటలు ఉంటాయి. ప్రతికూల శక్తి పెరిగినప్పుడు చాలా దూకుడుగా ప్రవర్తిస్తారు. ఇది ఇతరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు వల్ల వారికి తమపై తమకు నమ్మకం కూడా చాలా తగ్గుతుంది. ఇది ఇతర బంధాలపై కూడా ప్రభావం చూపిస్తుంది.

45
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి చిన్న ఇబ్బంది అయినా, చిన్న సంతోష మైనా వివపరీతంగా స్పందిస్తారు.  తమ అన్ని భావోద్వేగాలను తీవ్రంగా వ్యక్తపరుస్తారు. ఇందులో వారి కోపం, శత్రుత్వం కూడా ఉంటాయి. కొన్నిసార్లు వీరు తమ ఉద్వేగాలను నియంత్రించుకోలేరు.  చిన్నచిన్న విషయాలకు కూడా వారిలో అసంతృప్తి, కోపం పెరుగుతుంది.  వారి మనసులో  ప్రతికూల ఆలోచనలే అధికంగా ఉంటాయి. వీరి ప్రతికూల శక్తి ఇతరులకు కూడా తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెడుతుంది.

55
వృషభ రాశి

ప్రతికూల రాశుల జాబితాలో వృషభ రాశి వారికి మొదటి స్థానమని చెప్పుకోవాలి.  వీరికి మొండితనం ఎక్కువ. తాము అనుకున్నది జరగాలని అనుకుంటారు. వారు ఎంత మంచివారిగా ఉన్నాకూడా కొని సార్లు పూర్తి చెడ్డవారిగా మారిపోగలరు. కనీసం తాము చాలా చెడుగా ప్రవర్తిస్తున్నామన్న ఆలోచన కూడా వారికి తెలియదు. వీరు ఒక్కోసారి చాలా విషపూరితంగా మారుతారు. కాబట్టి వీరితో పాటూ జీవిస్తున్న వారికి, స్నేహితులకు కూడా వీరి వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories