జోతిష్య శాస్త్రంలో కేతువుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహం ఎవరి జాతకంలో శుభ స్థానంలో ఉంటే, వారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. మరి, ఆ నాలుగు రాశులేంటో చూద్దాం...
జోతిష్యశాస్త్రంలోని 9 గ్రహాల్లో కేతువు కూడా ఒకటి. ఈ గ్రహాన్ని రహస్య గ్రహంగా చెబుతుంటారు. దీని ప్రభావం మనకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చూపిస్తుంది. ఈ కేతు గ్రహం ఏ రాశివారి జాతకంలో శుభ స్థానంలో ఉంటే, వారిని ధరిద్రుడిని కూడా రాజును చేయగలదు. ఇక ఎవరి జాతకంలో అయినా అశుభ స్థానంలో ఉంటే.. వారి బుద్ధి బ్రష్టు పట్టించి.. ధరిద్రుడిని కూడా చేస్తుంది. ఈ గ్రహం ప్రతి 18 నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటుంది.
ఈసారి మే 18వ తేదీన కేతు గ్రహం కన్య రాశి నుంచి సింహ రాశిలోకి అడుగుపెట్టనుంది. మరి, కేతువు గ్రహం మారడం ఏయే రాశులకు అదృష్టాన్ని తేనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
25
మేష రాశి..
కేతువు రాశి మారడం వల్ల మేష రాశి వారికి ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తిపరమైన లక్ష్యాలు సకాలంలో పూర్తవుతాయి. సంతానం నుండి శుభవార్తలు వస్తాయి. ధనలాభం ఉంటుంది. ఇప్పటి వరకు ఏవైనా డబ్బు సమస్యలు ఉంటే, అవన్నీ తీరిపోతాయి.
35
కన్య రాశి..
మే 18న కేతువు రాశి మారడం వల్ల కన్య రాశి వారికి ధనలాభం ఉంటుంది. ఆస్తికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనం లభిస్తుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. సంతాన సుఖం కలుగుతుంది.
వృశ్చిక రాశి వారు పెద్ద సమస్య నుండి బయటపడతారు. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. కొత్త వాహనం లేదా ఇల్లు కొనే యోగం ఉంది. ప్రేమ జీవితానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
55
కేతు గోచారం 2025 కుంభ రాశి
కుంభ రాశి వారికి జీవితంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అత్తవారింటి నుండి విలువైన బహుమతి అందుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి.
Disclaimer ఈ వ్యాసంలోని సమాచారం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు. మేము ఈ సమాచారాన్ని మీకు అందించే ఒక మాధ్యమం మాత్రమే. దయచేసి ఈ సమాచారాన్ని కేవలం సమాచారం కోసం మాత్రమే ఉపయోగించుకోండి.