Ketu Sancharam: కేతువు వల్ల ఈ 5 రాశుల వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సులు ఎక్కువ

Published : Dec 19, 2025, 12:58 PM IST

Ketu Sancharam: కేతు సంచారం అనేది ఒక వ్యక్తి జాతకంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది.  2026 జనవరిలో కేతు సంచారం జరగనుంది. ఈ సంచారం కొన్ని రాశుల వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలను పెంచుతుంది.

PREV
16
కేతు సంచారం 2026

జ్యోతిషశాస్త్రంలో కేతువును ఛాయా గ్రహంగా, దుష్ట గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి చెడు జరిగితే, మరికొందరికి మేలు జరుగుతుంది.  2026 జనవరి 25న కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ నక్షత్రానికి శుక్రుడు అధిపతి. కాబట్టి ఈ నక్షత్ర సంచారం కొన్ని రాశులకు స్వర్ణయుగమేనని చెప్పవచ్చు.

26
వృషభం

వృషభ రాశి వారికి జనవరిలో జరిగే కేతు సంచారం ఎంతో కలిసి వస్తుంది. వీరికి ఆర్థిక పురోగతిని అధికంగా వస్తుంది. వీరికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఇప్పుడు ఉన్న ఆదాయానికి రెట్టింపు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. వీరికి  కుటుంబ ఆస్తులు నుంచి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంటే పాత భూములకు విపరీతంగా ధర వచ్చే ఛాన్స్ ఉంది. వీరికి అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వీరిలో విపరీతంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

36
సింహం

సింహ రాశి వారికి జనవరిలో జరిగే కేతు సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీరికి కేతువు వల్ల ఆకస్మిక ధన లాభం వచ్చే ఛాన్సులు కనిపిస్తాయి. అప్పుగా ఇచ్చిన వేరొకరి చేతిలో నిలిచి పోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.  అలాగే వీరికి సమాజంలో కీర్తి, గౌరవం అమాంతం పెరుగుతాయి.  అలాగే వీరికి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీ పై అధికారుల నుంచి మంచి సపోర్టు లభిస్తుంది. ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.

46
వృశ్చికం

వృశ్చిక రాశి వారికి కేతువు గమనం ఎంతో శుభ ఫలితాలను అందిస్తుంది. వీరికి డబ్బులు పరంగా విపరీతంగా కలిసివస్తుంది. వీరికి ఆర్థికంగా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మీకున్న పాత అప్పులు తీరుతాయి. విదేశీ ప్రయాణాలు చేయడం ద్వారా విపరీతమైన లాభాలు పొందే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే ఛాన్స్ వీరికి ఉంది.

56
ధనుస్సు

ధనుస్సు రాశికి వచ్చే ఏడాది జరిగే కేతు సంచారం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.  వీరి బ్యాంక్ బ్యాలెన్స్ అధికంగా పెరుగుతుంది.  వ్యాపారం చేసే వారికి కేతువు వల్ల  లాభాలు వస్తాయి. బంగారం, భూమి వంటి స్థిరాస్తులలో పెట్టుబడి పెడతారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనే యోగం ఉంది. మీకు కేతువు మొత్తంమ్మీద అన్ని రకాలుగా మేలే చేస్తాడు.

66
కుంభం

కుంభ రాశికి కేతు సంచారం ఎంతో కొంత మంచి ఫలితాలను అందిస్తుంది. వీరికి ధన ప్రవాహం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలుంటాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో బంగారం, నగలు కొనే అవకాశం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories