Kala yogam: రేపటి నుంచి కాల యోగం.. దీనివల్ల 5 రాశుల వారికి బీభత్సంగా కలిసొస్తుంది

Published : Oct 05, 2025, 07:44 PM IST

అక్టోబర్ రెండో వారంలో కాల యోగం (Kala yogam) ఏర్పడబోతోంది.  ఈ కాల యోగం వల్ల కొన్ని రాశుల (Zodiac Signs) వారికి ఎంతో మేలు జరుగుతుంది. మీకు అధికంగా కలిసివస్తుంది.  ఇళ్లలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

PREV
16
ఈ నెలలో కాల యోగం

రేపటి నుంచి అంటే అక్టోబర్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అనేక గ్రహాల మార్పులు జరగబోతున్నాయి. ఈ వారంలో శుక్రుడు సింహరాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. దీనివల్ల కాల యోగం ఏర్పడి ఎంతో కలిసివస్తుంది.  ఈ ఐదు రాశుల వారు ఊహించని విజయం, పదోన్నతి, గౌరవాన్ని పొందుతారు.

26
మేష రాశి

అక్టోబర్ 6 న ఏర్పడే కాల యోగం వల్ల మేషరాశికి ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయి. ఈ రాశివారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎంతో పురోగతి కనిపిస్తుంది. వృత్తిరీత్యా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది.  భూమి, భవనాలు, ఆస్తులు కొనేందుకు ప్రయత్నిస్తారు.

36
సింహ రాశి

సింహరాశి వారికి ఈ కాలయోగం చాలా కలిసొస్తుంది. కోర్టు కేసులలో  ఉన్నవారికి ఎంతో సానుకూలమైన తీర్పులు వస్తాయి. మీ కష్టాలు తీరతాయి. విదేశాలు వెళ్లే వారికి  ఇది మంచి సమయం . ఆఫీసులో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. పనిభారం చాలా వరకు తగ్గుతారు.  మీ ఆఫీసులో మీకున్న శత్రువులు ఓడిపోతారు. మీకు కుటుంబ, వృత్తి జీవితం రెండూ ఎంతో సంతోషంగా మారతాయి. 

46
తులా రాశి

కాలయోగం తులా రాశి వారికి ఎంతో అదృష్టాన్ని తెస్తుంది. ఈ వారం మీకు మీ పెద్ద పదవి దక్కవచ్చు. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారపరంగా మీకు బాగా కలిసివస్తుంది. ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. పూర్వీకుల ఆస్తులు కూడా మీకు దక్కుతాయి. 

56
వృశ్చిక రాశి

కాల యోగం వల్ల వృశ్చిక రాశి వారికి అదృష్టం దక్కుతుంది.  ఈ రాశిలో జన్మించిన మహిళలు ఉద్యోగపరంగా విజయాలు అందుకుంటారు.  కుటుంబంలోనూ మీ గౌరవం పెరుగుతుంది.  చిన్న చిన్న అప్పులు తీర్చేస్తారు. పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. 

66
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి.  మీకు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు జరుగుతాయి. వాటిని మీరు భగ్నం చేసి విజయం సాధిస్తారు. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య అపార్థాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. అన్నింటినీ మీరు అధిగమిస్తారు.  మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. డబ్బును మంచి పథకాలలో పెట్టుబడి పెడతారు. 

Read more Photos on
click me!

Recommended Stories