Jupiter Effects: 2026లో ఈ రెండు రాశులకు గురు బలం ఎక్కువ, ఏడాదంతా కలిసొస్తుంది

Published : Nov 28, 2025, 05:16 PM IST

Jupiter Effetcts: గురు బలం ఉంటే చాలు ఏ రాశివారైన ఎంతో ఎత్తుకు ఎదిగిపోతారు.  2026లో రెండు రాశుల వారికి ఏడాది పొడవునా గురు బలం ఉంటుంది. దీని వల్ల వారు అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్నిరకాలుగా కలిసివస్తాయి. 

PREV
14
వచ్చే ఏడాది గురుబలం

కొత్త ఏడాది వచ్చేస్తోంది. వచ్చే ఏడాది కొన్ని రాశుల వారికి  బీభత్సంగా కలిసి వస్తుంది. 2026కి అధిపతి గురువే. ఇతని కరుణా కటాక్షాలు ధనుస్సు,  మీన రాశులపై పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు రాశులకు గురు బలం అధికంగా ఉంటుంది.  ఈ రెండు రాశులకు కొత్త ఏడాది మొత్తం శుభప్రదంగా ఉంటుంది. గురు శుభ ప్రభావం ఉంటే చాలు. ఈ రెండు రాశులకు ఏడాది పొడవునా ఆర్థికంగా లాభాలు పొందుతారు.

24
ధనూ రాశి

ధనుస్సు రాశి వారికి వచ్చే ఏడాది బాగా కలిసివస్తుంది. ఈ రాశి వారిపై గురు ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ ఫలితాలు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ఖర్చులు తగ్గించుకుని మరీ  డబ్బు ఆదా చేస్తారు. పాత పెట్టుబడులు మీకెంతో లాభాలు స్తాయి.  మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి  ఏడాదంతా బాగా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఏవీ రావు.

34
మీన రాశి

మీన రాశి వారికి ఎంతో కలిసి వచ్చే సంవత్సరం. ఎన్నో ఆర్థిక లాభాలు కలిసివస్తాయి.  గురు బలం వల్ల 2026లో వీరి ఆదాయం పెరుగుతుంది.  వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. మీరు కొత్త వ్యాపారం చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. మీరు పనిచేసే చోట మీ గౌరవం, మర్యాద పెరుగుతాయి. ఈ ఏడాది ఆరోగ్యం బాగుంటుంది.

44
గురు బలం కావాలంటే ఇలా చేయండి

గురు బలం అధికంగా ఉండాలంటే గురు వారం విష్ణువును పూజించి, కుంకుమ నుదుటిన పెట్టుకోవాలి.  కొత్త ఏడాదిలో శాకాహారం మాత్రమే తీసుకోండి.  తల్లిదండ్రుల ఆశీర్వాదం అప్పుడప్పుడు తీసుకోవాలి. గురు బలం అనుగ్రహం బెల్లం, శనగలు, పసుపు వస్తువులు దానం చేయాలి. రావి చెట్టు లేదా తులసి మొక్క దగ్గర ధ్యానం చేయండి. కొత్త సంవత్సరంలో  ఈ పరిహారాలు చేస్తే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories