గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. రాశులను మార్చుకోవడంతో పాటు.. నక్షత్రాలను కూడా మార్చుకుంటూ ఉంటాయి. ఇలా మార్చుకున్న ప్రతిసారీ.. జోతిష్యశాస్త్రంలోని 12 రాశుల లైఫ్ మారిపోతుంది. ఇప్పుడు ఈ మేలో కూడా మూడు రాశుల లైఫ్ మారిపోనుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం మే నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలోని 31 రోజుల్లో సూర్యుడు, బుధుడు, రాహువు, కేతువులు సంచారం చేస్తాయి. అంతేకాకుండా, గురు గ్రహంలోని మార్పు కనిపిస్తుంది వైదిక క్యాలెండర్ ప్రకారం మే నెల చివరిలో గురు గ్రహం మృగశిర నక్షత్రంలోని మూడో పాదం నుంచి నాలుగో పాదంలోకి ప్రవేశిస్తుంది. ఈ సంచారం మే 30వ తేదీన జరగనుంది.