Jupiter Transit: మిథున రాశిలో గురు గ్రహ సంచారం.. 6 నెలలు ఈ ఐదు రాశులకు రాజయోగం

Published : Dec 04, 2025, 10:20 AM IST

Jupiter Transit: గురు గ్రహం డిసెంబర్ 5న మిథున రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సంచారం  కొన్ని రాశుల జీవితాలను పూర్తిగా మార్చేయనుంది. ముఖ్యంగా ఐదు రాశులకు ఎక్కువ ప్రయోజనాలను కలగనుంది.  ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళతారు.

PREV
16
Jupiter Transit

జోతిష్యశాస్త్రంలో గురు గ్రహాన్ని శుభ గ్రహాల రాజుగా పరిగణిస్తారు. వృద్ధి, సంపద, అదృష్టం, గౌరవం, వివాహం, సంతానం వంటి జీవితంలోని ప్రధాన అంశాలను గురు ప్రభావితం చేస్తాడు. ఇప్పుడు గురు గ్రహం మిథున రాశిలోకి అడుగుపెడుతున్నాడు. డిసెంబర్ 5న ఈ సంచారం జరగనుంది. దాదాపు ఆరు నెలల పాటు అదే రాశిలో ఉండనుంది. ఈ ఆరు నెలలో ఐదు రాశులకు విపరీతంగా కలిసి రానుంది. మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోనున్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం....

26
వృషభ రాశి...

డిసెంబర్ 5 తర్వాత వృషభ రాశివారికి రాజయోగం పట్టనుంది. ఆరు నెలల పాటు వీరికి బాగా కలిసి రానుంది. ముఖ్యంగా కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. జీతం పెరగడమో లేక ప్రమోషన్స్ రావడమో కచ్చితంగా జరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా రావచ్చు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అలవాటు ఉంటే... వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.

36
కర్కాటక రాశి....

గురు గ్రహ సంచారం కర్కాటక రాశివారికి కూడా చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో చాలా బాగా కలిసిరానుంది. లాభాల బాట పట్టనున్నారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అంతేకాదు.. ఆగిపోయిన పనులు మళ్లీ పూర్తి చేయగలరు. బ్యాంకింగ్, భూమి, రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లగలరు.

46
సింహ రాశి...

గురు గ్రహ సంచారం సింహ రాశివారికి బాగా కలిసిరానుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పనిలో గుర్తింపు లభిస్తుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రజాదరణ పొందుతారు. రాజకీయ, సామాజిక సేవారంగంలో మంచి గుర్తింపు పొందుతారు. స్నేహితులు, పెద్దల సహకారం మీకు లభిస్తుంది.

56
ధనుస్సు రాశి....

గురు గ్రహ సంచారం ధనుస్సు రాశి వారికి రాజయోగం తీసుకురానుంది. దాంపత్య జీవితం ఆనందంగా మారుతుంది. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. పెళ్లి చేసుకోవాలని అనుకునేవారికి ఇది సరైన సమయం. వ్యాపారాలు చేసే వారు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం రావచ్చు. ఈ సమయంలో ఏ పనులు చేసినా విజయం సాధించి తీరుతారు. జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.

66
కుంభ రాశి...

గురు గ్రహ సంచారం కుంభ రాశివారికి చాలా మేలు చేయనుంది. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసి రానుంది. వ్యాపారాల నుంచి మంచి లాభాలు పొందుతారు. కొత్త ఇల్లు , ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. సంతానం లేని వాళ్లకు సంతానం కలిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తీరి.. సుఖాలు పెరిగే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories