ఈ రాశి వారికి డిసెంబ‌ర్ ల‌క్కీ నెల‌.. అన్నింటిలో సూప‌ర్ స‌క్సెస్‌, కానీ ఒక్క విష‌యంలో మాత్రం

Published : Dec 04, 2025, 09:46 AM IST

Tarot Horoscope: సంప్రదాయ జ్యోతిష్య శాస్త్రంతో పాటు టారో జాతకాన్ని కూడా చాలా మంది నమ్ముతారు. ఇది ప్రత్యేకమైన టారో కార్డులు ఉపయోగించి చేసే ఒక జోస్య పద్ధతి. టారో హారోస్కోప్ ప్రకారం డిసెంబర్ నెలలో కుంభ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
డిసెంబర్ నెల ఫలితాలు

కుంభ రాశి వారికి 2025 డిసెంబర్ నెల మొత్తం అనుకూలంగా ఉంటుందని టారో కార్డుల సూచనలు చెబుతున్నాయి. ఈ కాలంలో మీ ఆర్థిక వనరులు పెరుగుతాయి. కుటుంబం, స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. సామాజికంగా మంచి పేరు, గౌరవం లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగి, నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు.

25
ప్రేమ, వివాహం

దాంపత్య జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు ఈ నెలలో మీకు చాలా ఉపయోగపడతాయి. గతంలో ఏవైనా చిన్నపాటి విభేదాలు ఉన్నా, అవి ఈ నెలలో తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. పిల్లలకు కూడా మంచి ఫలితాలు రావడం వల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.

35
ఆర్థిక ఫలితాలు

డిసెంబర్‌లో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. Ace of Swords కార్డు మీ ఆలోచనలు స్పష్టంగా ఉండేలా సూచిస్తోంది. కొత్త ప్రణాళికలు, పెట్టుబడులు అనుకూలంగా మారతాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు, రిస్క్ పెట్టుబడుల నుంచి దూరంగా ఉండడం ఈ నెలలో సూచించతగ్గ అంశం. అలాగే డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది.

45
కెరీర్, పని

ఉద్యోగం, వ్యాపారంలో మీ పనితీరు బాగానే ఉంటుంది. Ten of Wands కార్డు చెబుతున్న దాని ప్రకారం.. బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం అవసరం. కొత్త రిస్క్ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించకుండా, ముందుగా ప్లాన్ చేసి ఆపై ముందుకు వెళ్లడం మంచిది.

55
ఆరోగ్యం, ప్రయాణం

ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. రెగ్యులర్ వ్యాయామం, మంచి ఆహారం, సరైన నిద్ర పాటిస్తే శరీరానికి మనసుకు సమతుల్యత ఉంటుంది. ఈ నెలలో ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా మారవచ్చు. ఈ నెలలో శుభఫలితాలు ఇంకా పెరగాలంటే కుక్కలకు ఆహారం పెట్టండి. ఇది మీ అదృష్టాన్ని, సానుకూల శక్తిని పెంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories