ధనుస్సు రాశి వారికి బద్ధకం ఎక్కువగానే ఉంటుంది. వీరికి పరిమితులు, హద్ధులు పెట్టడం ఏమాత్రం ఇష్టపడరు. స్వేచ్ఛగా తమ పని తాము చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. వీరికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక అధికం. ప్రయాణాలు చేయడానికి, స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. తమ ప్రయాణానికి ఎంత డబ్బు అవసరమో దాని కోసం మాత్రమే పని చేస్తారు. కానీ ఆఫీసులో ముందుండాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మాత్రం ఉండదు. దానికి కారణం బద్ధకం.