July Horoscope: జూలై నెలలో ఈ రాశుల వారికి ప్రమోషన్స్.. వ్యాపారాల్లో లాభాలు!

Published : Jul 03, 2025, 06:08 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెలలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు.. మరికొన్ని రాశులవారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గ్రహాల సంచారం ప్రభావంతో.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
112
మేష రాశి (Aries)

మేష రాశివారికి జూలై నెల అంతగా అనుకూలించకపోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వృథా ఖర్చులు తగ్గించుకోకపోతే ఇబ్బందిపడాల్సి వస్తుంది. రాహు-కేతు ప్రభావంతో సంబంధాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓపికగా ఉండటం మంచిది.

212
వృషభరాశి (Taurus)

వృషభరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది.

312
మిథున రాశి (Gemini)

మిథున రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రేమబంధం బలపడుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి.

412
కర్కాటక రాశి (Cancer)

కర్కాటక రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయంలో లాభాలు దక్కుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిదికాదు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

512
సింహ రాశి (Leo)

సింహ రాశివారికి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం.

612
కన్య రాశి (Virgo)

కన్య రాశివారికి ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. సహోద్యోగులతో వివాదాలు కలుగవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.

712
తుల రాశి (Libra)

తుల రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం దక్కుతుంది. శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

812
వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశివారు ఉద్యోగం, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలుగుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు రావచ్చు. జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. 

912
ధనుస్సు రాశి (Sagittarius)

ధనుస్సు రాశివారు ఉద్యోగం, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

1012
మకర రాశి (Capricorn)

మకర రాశివారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

1112
కుంభ రాశి (Aquarius)

కుంభ రాశివారు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది.

1212
మీన రాశి (Pisces)

మీన రాశివారిని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. కుటుంబ సంబంధ విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories