Number 4: నెంబర్ 4 అన్ లక్కీ సంఖ్యా? మరణానికి నాలుగు అంకెకు ఏమిటి సంబంధం?

Published : Nov 03, 2025, 10:35 AM IST

Number 4: కొన్ని నెంబర్లు లక్కీగా చెప్పుకుంటారు. అలాగే నెంబర్ 4ను ఎంతో మంది అన్ లక్కీగా చెబుతారు. దక్షిణ కొరియాతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో 4వ నంబర్‌ను దురదృష్టకరమైనదిగా భావిస్తారు. ఎందుకలా?

PREV
18
ప్రతి సంఖ్యకు ప్రత్యేకత

న్యూమరాలజీ ప్రకారం ప్రతి సంఖ్య ప్రత్యేకమైనది. ప్రతి సంఖ్యకు అధిపతిగా గ్రహం ఉంటుంది. అది ఆ సంఖ్య వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని దేశాల్లో కొన్ని సంఖ్యలను దురదృష్టకరమైనవని అంటారు. ముఖ్యంగా 4ను అన్ లక్కీ అని చెబుతారు. 

28
దక్షిణ కొరియాలో

దక్షిణ కొరియాలో 4వ అంకె అంటేనే భయపడితారు. దాన్ని అశుభంగా భావిస్తారు. అందుకే ఆ దేశంలో ఎక్కడా ఈ అంకె కనిపించదు. ఈ సంఖ్య అంటేనే ఎంతో మంది భయం.

38
4వ నంబర్‌ను ఎందుకు అశుభం?

దక్షిణ కొరియా దేశంలో కొరియన్ భాషలో 4వ నంబర్ ఉచ్ఛారణ అనేది మరణం అనే పదాన్ని పోలి ఉంటుంది. దక్షిణ కొరియాలో 4వ నంబర్‌ను దురదృష్టకరమైనదిగా భావిస్తారు.

48
మరణ భయం

దక్షిణ కొరియన్లు 4వ నంబర్ అంటేనే మరణభయం ఎక్కువ. ఈ అంకె దురదృష్టాన్ని, మరణాన్ని తెస్తుందని వారికి భయం. అందుకే ఆ నెంబర్ కు దూరంగా ఉంటారు. దాన్ని నోటితో పలకడం కాదు కదా ఎక్కడా రాయడం కూడా చేయరు. నిజానికి ఈ నెంబర్ ను  అక్కడ నిషేధించారు.

58
4కు బదులు ఏమి రాస్తారు?

దక్షిణ కొరియాలో 4వ నంబర్‌ను అశుభంగా భావిస్తారు కాబట్టి దీన్ని రాయరు.  మరి 1, 2, 3 తర్వాత ఏం రాస్తారు అనే సందేశం ఎంతో మంది ఉంటుంది. దాన్ని బదులు భవనాలు, ఆసుపత్రులు, లిఫ్టులలో 4కి బదులుగా 'F' అనే అక్షరాన్ని వాడతారు.

68
ఈ నెంబర్లను కూడా వాడరు

దక్షిణ కొరియాలో 4వ నంబర్ వాస్తవంగా ఉనికిలోనే లేదు.  ఆ దేశంలో చాలా చోట్ల 4, 14, 24 నంబర్లను కూడా వాడరు. కొన్ని హోటళ్లలో ఈ నంబర్లతో గదులు కూడా ఉండవు.

78
ఈ దేశాలకూ భయం

4 నెంబర్ అంటే భయపడడాన్ని టెట్రాఫోబియా అంటారు.  దక్షిణ కొరియాలో మాత్రమే కాదు.. చైనా, జపాన్, తైవాన్‌లలో కూడా 4వ నంబర్‌ను అశుభంగా భావిస్తారు. 

88
ఈ సంఖ్యను చాలా శుభప్రదంగా భావిస్తారు

దక్షిణ కొరియాలో 4వ నంబర్‌ను అశుభంగా భావించినట్లే, 7, 8 సంఖ్యలను శుభప్రదంగా భావిస్తారు. ఇక్కడ 7, 8 సంఖ్యలను ఆనందం, శ్రేయస్సు, విజయానికి చిహ్నంగా చూస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories