
జోతిష్యశాస్త్రం మాదిరిగానే న్యూమరాలజీ కూడా మన జీవితాలను చాలా బాగా ప్రభావితం చేస్తుంది. మనం పుట్టిన తేదీని ఆధారంగా మన వ్యక్తిత్వం, ప్రవర్తన లాంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఈ రోజు నెంబర్ 4 తేదీలో పుట్టిన వ్యక్తుల్లో చాలా ప్రత్యేకతలు ఉంటాయట. ఏ నెలలో అయినా 4, 13, 22 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు.మరి, వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం...
ఈ నెంబర్ 4లో పుట్టిన వారు చాలా నిజాయితీతో ఉంటారు. వారు బంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీరికి ఎవరితో అయినా బంధం ఏర్పడింది అంటే చాలు...వారితో బంధం చివరి వరకూ ఉండాలని కోరుకుంటారు. ప్రేమ అంటేనే లోతైన, నిజమైన భావం అని నమ్ముతారు. ఒకసారి సంబంధంలోకి వచ్చిన తర్వాత పూర్తి విధేయత, అంకింత భావంతో భాగస్వామిని ప్రేమిస్తారు. అయితే.. వీరు కొంచెం ఇంట్రావర్ట్స్. తమ భావాలను తొందరగా బయటపెట్టరు. వీరు ముఖ్యంగా నిజాయితీ కోరుకుంటారు. కొన్ని సార్లు మొండితనం, కఠినమైన నియమాలకు కట్టుబడి ఉంటారు.
నెంబర్ 4 లో పుట్టిన వ్యక్తులు కుటుంబం పట్ల అత్యంత మమకారంతో ఉంటారు. కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడం కోసం ఏదైనా చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. వీరు పెద్దగా రొమాంటిక్ కాకపోయినా, జీవిత భాగస్వామికి విధేయత, గౌరవం, నమ్మకం చూపడంలో ముందుంటారు. అయితే, కొన్నిసార్లు వీరి ఆవేశం సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
నెంబర్ 4 కి అనుకూలత గా ఉండే నెంబర్లు...
డెస్టినీ నంబర్ 4 – అనుకూలత (Compatibility)
అత్యంత అనుకూల సంఖ్యలు: 1, 2, 7, 8
మోస్తరు అనుకూల సంఖ్యలు: 5, 6, 9
అనుకూలం కాని సంఖ్యలు: 3, 8
నెంబర్ 1..
నెంబర్ 4 వారికి నెంబర్ 1 లో పుట్టిన వారు చాలా అనుకూలంగా ఉంటారు. వీరి మధ్య అభిప్రాయ బేధాలు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.కొంచెం అయినా పరస్పర అవగాహన ఉంటే మంచి స్నేహం లేదా వివాహం సాధ్యమే.
నెంబర్2..
నెంబర్ 4లో పుట్టిన వారికి నెంబర్ 2 లో పుట్టిన వారి మధ్య సహజంగా సామరస్యం ఉంటుంది. కుటుంబం, స్నేహం, వ్యాపార సంబంధాల్లో కూడా సఫలమవుతారు.
నెంబర్ 3..
నెంబర్ 3 లో పుట్టిన వారికి నెంబర్ 4 లో పుట్టిన వారి మధ్య కూడా అనుకూలత చాలా తక్కువ. ఈ జంట ఎక్కువగా కలిసిపోరు. స్నేహం లేదా దీర్ఘకాలిక సంబంధాలకు ఇది అనుకూలం కాదు.
నెంబర్ 4...
నెంబర్ 4లో పుట్టిన వారు అదే నెంబర్ కలిగిన వారితో బాగా కలిసిపోతారు. కానీ ఎక్కువగా గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
నెంబర్ 5...
ఇక నెంబర్ 4, నెంబర్ 5 తేదీల్లో పుట్టిన వారి మధ్య బంధం కాస్త పర్వాలేదు.వివాహం, స్నేహం, వ్యాపార సంబంధాలలో బాగా కలిసిపోతాయి.
నెంబర్ 6..
నెంబర్ 4, నెంబర్ 6 లో పుట్టిన వారి మధ్య కంపాటబులిటీ కాస్త పర్వాలేదు. ఈ రెండు తేదీల మధ్య స్నేహం, పెళ్లి కుదురుతుంది. బాధ్యతగా బంధాన్ని కొనసాగిస్తారు. మంచి స్నేహితులు కూడా అవుతారు.
నెంబర్ 7..
ఇది అత్యంత అనుకూలమైన కలయిక. వివాహం లేదా వ్యాపారంలో వీరు ఒకరికి ఒకరు పూరకంగా ఉంటారు. సంబంధం మధురంగా కొనసాగుతుంది.
నెంబర్ 8..
కొన్నిసార్లు ఈ జంట ఘర్షణలకు దారితీస్తుంది. కాబట్టి ఎక్కువ నిపుణులు ఈ కలయికను నివారించమని సూచిస్తారు. స్నేహం, పెళ్లి రెండింటికీ ఈ నెంబర్లు సెట్ అవ్వవు.
నెంబర్ 9..
నెంబర్ 4, నెంబర్9 లో పుట్టిన వారు బాగానే కలిసిపోతారు. వీరి మధ్య స్నేహం, వివాహం, వ్యాపారంలో భాగస్వామ్యం బాగానే కుదురుతుంది.
సారాంశం
నంబర్ 4 కలిగిన వ్యక్తులు జీవితంలో స్థిరత్వం, నిజాయితీ, అంకితభావం కోరుకునే వారే. వీరి సంబంధాలు ఎక్కువగా దీర్ఘకాలికం ,విశ్వాసపూర్వకంగా ఉంటాయి. సరైన భాగస్వామి ఎంపిక చేస్తే, వీరి జీవితం ఆనందభరితంగా, విజయవంతంగా ఉంటుంది.