3.బంగారం, వెండి..
మీ కలలో బంగారం లేదా వెండిని చూడటం, ఆ లోహాలతో చేసిన ఆభరణాలను చూడటం ఆర్థిక లాభానికి సంకేతంగా భావిస్తారు. మీరు తెల్లవారుజామున కలలో బంగారం, వెండి ఆభరణాలు కనపడితే, మీ బ్యాంకు ఖాతాలో డబ్బు రెట్టింపు అవుతుంది. జీతం పెరుగుతుంది. వ్యాపారాల నుంచి కూడా లాభాలు వస్తాయి.
4.వెలుగుతున్న దీపం...
మీకు ఎప్పుడైనా తెల్లవారుజామున వెలుగుతున్న దీపం గురించి కల వస్తే, అది అత్యంత శుభప్రదమైన కలగా పరిగణిస్తారు. ఇది మీకు అనేక విధాలుగా శుభ ఫలితాలను చేకూర్చగలదు. జీవితంలో చీకటి పోయి.. వెలుగులు వస్తాయి. అనుకోని విధంగా మీ చేతికి డబ్బులు వస్తాయి.
5.నీటితో నిండిన కుండ..
మీ కలలో నీటితో నిండిన పాత్రను చూడటం కూడా అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఒకవేళ మీరు మీ కలలో నీటి పాత్రను లేదా నీటితో నిండిన కుండను చూసినట్లయితే, అది మీకు ఆర్థికపరమైన పురోగతి లభించబోతోందని సూచిస్తుంది. ఆదాయం రోజు రోజుకీ పెరుగుతుందని ఈ కల సూచిస్తోంది.