కళాత్మక యోగం..
జోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా మార్చుకోవడం వల్ల శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 5 వ తేదీన సంకష్ట చతుర్థి రోజున సంపదకు అధిపతి అయిన శుక్రుడు, చంద్రుడు వ్యతిరేక దిశలలో సంచరిస్తూ ఒక కళాత్మక యోగాన్ని ఏర్పరచనున్నాయి. శుక్రుడు మేష రాశిలో, చంద్రుడు తుల రాశిలో సంచరిస్తున్నారు. దీని వల్ల ఏర్పడిన కళాత్మక యోగం అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం..