చనిపోయిన వ్యక్తి కలలో సంతోషంగా కనిపిస్తే...
చనిపోయిన వ్యక్తికలలో సంతోషంగా కనిపిస్తే, అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అలాంటి కల మీ కోరికలను నెరవేరుస్తుంది. అయితే, చనిపోయిన వ్యక్తి ఏడుస్తున్నట్లు కనిపించినా కూడా అది శుభప్రదమే. మీరు ఏదైనా ప్రయత్నంలో గొప్ప విజయం సాధిస్తారు అని చెబుతున్నారని అర్థం.
చనిపోయిన వ్యక్తి కలలో ఆశీర్వదిస్తే
చనిపోయిన వ్యక్తి మీ కలలో కనిపించి మిమ్మల్ని ఆశీర్వదిస్తే, మీరు భవిష్యత్తులో గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థం. మీరు ఒక కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, మరణించిన వ్యక్తి పదే పదే మీ పేరు పిలిస్తే, వారు ఏదో చెడు విషయం గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.ఏదైనా విషయం మీకు చెబుతున్నట్లు కల వస్తే.. త్వరలో శుభవార్త వినబోతున్నారని అర్థం.
కలలో మరణించిన వ్యక్తి ఆహారం అడిగితే
మరణించిన వ్యక్తి మీకు ఆహారం అడుగుతున్నట్లు కల వస్తే, అది ఒక చెడు శకునం. మీరు గుడికి వెళ్లి వారికి ఇష్టమైన వస్తువును సమర్పించి ప్రార్థిస్తే, మీకు మేలు జరుగుతుంది.
మరణించిన వ్యక్తి నవ్వుతున్నట్లు కల వస్తే
మీ కలలో మరణించిన వ్యక్తి నవ్వుతూ కనిపిస్తే, వారి చాలా కాలంగా తీరని కోరిక నెరవేరిందని దానికి సంకేతం. ఇది ఒక మంచి శకునం. మీ కలలో మరణించిన వ్యక్తి ఏదైనా వస్తువు వైపు లేదా వ్యక్తి వైపు వేలు చూపిస్తే, ఆ వ్యక్తికి సంబంధించిన ఏదో చెడు వార్త వినబోతున్నారని అర్థం. ఎవరైనా అనారోగ్యంతో మరణించి, వారు మీ కలలో ఆరోగ్యంగా కనిపిస్తే, వారు ఒక మంచి కుటుంబంలో జన్మించారని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.