గురు, శుక్రుల అర్ధకేంద్ర యోగం.. ఈ 3 రాశులకు ఇక అన్నీ మంచి రోజులే!

Published : Sep 21, 2025, 03:35 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 25న గురు, శుక్ర గ్రహాలు 45 డిగ్రీల కోణంలో ఉంటాయి.  దీనివల్ల అర్ధకేంద్ర యోగం ఏర్పడుతుంది. గురు, శుక్ర అర్ధకేంద్ర యోగం కొన్ని రాశుల వారికి కనక వర్షాన్ని కురిపిస్తుంది. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి ఉందో చూడండి. 

PREV
14
గురు, శుక్రుల అర్ధకేంద్ర యోగం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దేవీ నవరాత్రుల సమయంలో దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రుడితో కలిసి అర్ధకేంద్ర యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఇది ముఖ్యంగా మూడు రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందామా.. 

24
వృషభ రాశి

గురు, శుక్రుల అర్ధకేంద్ర యోగం వృషభ రాశివారికి జీవితంలో ఊహించని మార్పులను తెస్తుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భూమి, ఆస్తి విషయాలు లాభదాయకంగా ఉంటాయి. గురు కృపతో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

34
సింహ రాశి

సింహ రాశి వారికి బుధ, గురుల అర్ధకేంద్ర యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగ ప్రభావంతో ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన ప్రతి పని అనుకూలంగా సాగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

44
ధనుస్సు రాశి

గురు, శుక్రుల అర్ధకేంద్ర యోగం ధనుస్సు రాశివారికి చాలా శుభప్రదం. ఈ సమయంలో అదృష్టం వీరి వెంటే ఉంటుంది. కొత్త అవకాశాలు దక్కుతాయి. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో లాభాల వర్షం కురుస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories