Grahan Yoga: గ్రహణ యోగం.. ఈ 4 రాశుల వారికి కష్టాలు, కన్నీళ్లు తప్పవు..!

Published : May 08, 2026, 03:45 PM IST

Grahan Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ యోగాన్ని అశుభంగా పరిగణిస్తారు. త్వరలో రాహువు, సూర్యుల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడనుంది. ఈ ప్రభావం 4 రాశులవారిపై తీవ్రంగా పడనుంది. మరి ఆ రాశులేవో.. వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ చూద్దాం.

PREV
15
గ్రహణ యోగం 2026

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కలయిక వల్ల గ్రహణ యోగాలు ఏర్పడతుంటాయి. వీటిని అశుభ సూచికంగా భావిస్తారు. మే 10న రాహువు, సూర్యుడి కలయికతో గ్రహణ యోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల 4 రాశుల వారు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేవి? వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

25
మేష రాశి

మరో రెండు రోజుల్లో ఏర్పడనున్న గ్రహణ యోగం వల్ల మేష రాశి వారికి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయటా చికాకు వాతావరణం ఉంటుంది. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతాయి. ఉద్యోగంలో పై అధికారులతో విభేదాలు రావచ్చు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశం చాలా తక్కువ.

35
సింహ రాశి

సింహ రాశి వారికి ఈ గ్రహణ యోగం ప్రతికూల ఫలితాలనిస్తుంది. వీరు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా, సమాజంలో మీకున్న గౌరవానికి భంగం కలగవచ్చు. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం దక్కదు.

45
కన్య రాశి

మే 10న ఏర్పడే గ్రహణ యోగం కన్య రాశి వారికి అస్సలు అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల నష్టాలు చవిచూస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇంటా బయటా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు రావచ్చు. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.

55
కుంభ రాశి

మేష, సింహ, కన్య రాశులతో పాటు కుంభ రాశి వారికి కూడా ఈ గ్రహణ యోగం అశుభ ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా, గతంలో చేసిన తప్పులు టెన్షన్ ని పెంచుతాయి. ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటా బయటా చికాకు వాతావరణం ఉంటుంది. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories