జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. దైవం వారికి తోడుగా ఉంటూ ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది. అలా దుర్గాదేవికి ఇష్టమైన కొన్ని రాశులున్నాయి. ఈ నవరాత్రుల్లో వారికి మరింత మేలు జరుగుతుంది. ఆ రాశులేంటో చూద్దామా..
దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే కొన్ని రాశులవారు సహజంగానే అమ్మవారి ఆశీస్సులు పొందుతారట. వీరికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, సమస్యల నుంచి బయటపడే శక్తి లభిస్తుందట. మరి ఆ రాశులేంటో చూద్దామా..
26
వృషభ రాశి
వృషభ రాశి వారికి దుర్గాదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వృషభం అమ్మవారి శైలపుత్రి, మహాగౌరి అవతారాల వాహనం. అందుకే వీరికి అమ్మ ఆశీస్సులు ఎక్కువ. వీరు నాయకత్వ లక్షణాలు, ధైర్యంతో కష్టాలను ఎదుర్కొంటారు. దుర్గాదేవీ వీరికి ఎప్పుడూ అండగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
36
కర్కాటక రాశి
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. దుర్గాదేవి మూడో అవతారం చంద్రఘంట. ఈ అవతారంలో అమ్మవారి నుదుటిపై చంద్రుడు ఉంటాడు. అందుకే ఈ రాశి వారికి అమ్మవారి పూర్తి అనుగ్రహం ఉంటుంది. వీరు కష్టపడి పనిచేస్తారు. తెలివైనవారు. ఎలాంటి పనినైనా దేవీ ఆశీస్సులతో ఈజీగా పూర్తిచేస్తారు.
దుర్గాదేవి వాహనం సింహం. సింహ రాశికి చిహ్నం కూడా సింహమే. అందుకే ఈ రాశి వారంటే అమ్మవారికి చాలా ఇష్టం. వీరికి శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అమ్మవారి దయతో జీవితంలో విజయాలు సాధిస్తారు.
56
కన్య రాశి
కన్య రాశి స్త్రీలను సూచిస్తుంది. స్త్రీలను దుర్గాదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే అమ్మవారికి ఈ రాశంటే ఇష్టం. ఈ రాశి వారు చురుకుగా, హేతుబద్ధంగా ఆలోచిస్తారు. అమ్మవారి ఆశీస్సులతో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతారు.
66
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశి చిహ్నం విల్లు. ఇది దుర్గాదేవి ఆయుధాలలో ఒకటి. అందుకే ఈ రాశి అమ్మవారికి ఇష్టమైన రాశి. వీరు ఎలాంటి గందరగోళంలోనైనా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి.
గమనిక
ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్య అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా అందించింది. ఏషియానెట్ న్యూస్ తెలుగు దీన్ని ధృవీకరించలేదు.