నెంబర్ 2...
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా సౌమ్యంగా ఉంటారు. అత్తమామలను చాలా ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో శాంతి, ఐక్యతను పెంచుతారు. వీరు అడుగుపెట్టిన ఇంట్లో భావోద్వేగ సుఖ సంతోషాలు పెరుగుతాయి.
నెంబర్ 3...
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈనెలల్లో పుట్టిన అమ్మాయిలపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి అదృష్టాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. వీరు అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో మంచి లాభాలు వస్తాయి. ధార్మిక భావనలు పెరుగుతాయి.