Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరికీ భయపడరు..!

Published : May 15, 2025, 06:22 PM IST

న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరికీ భయపడరు. వారు తాము నమ్మిన సత్యం కోసం ధైర్యంగా నిలపడతారు. 

PREV
15
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరికీ భయపడరు..!

మహిళను సహనానికి ప్రతిరూపంగా చెబుతారు.ఇప్పటికీ అత్తారింట్లో చాలా రకాల బాధలను మౌనంగా భరిస్తున్న మహిళలు చాలా మంది ఉన్నారు. భర్త, అత్తమామలు పెట్టే బాధలను మౌనంగా భరించేవారు ఉన్నారు. ఇలాంటి అమ్మాయిల మధ్య కూడా ఎవరికీ భయపడకుండా ఎదురుతిరిగే అమ్మాయిలు కూడా ఉన్నారు. తమ ఎదుట ఉన్నది ఎలాంటి వ్యక్తి అయినా భయపడకుండా నిలబడే అమ్మాయిలు కూడా ఉన్నారు.  న్యాయ కోసం నిర్భయంగా ముందుకు అడుగులు వేస్తారు. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరికీ భయపడరు. వారు తాము నమ్మిన సత్యం కోసం ధైర్యంగా నిలపడతారు. తమ చుట్టూ ఉన్నవారందరూ తమకు వ్యతిరేకంగా ఉన్నా, వీరు మాత్రం వెనకడుగు వేయడానికి ఇష్టపడరు. మరి ఆ తేదీలేంటో చూద్దామా...

25

న్యూమరాలజీ ప్రకారం , పుట్టిన తేదీలు వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా సంఖ్యలు వ్యక్తిగత శక్తిని ప్రతిబింబిస్తాయి. కొన్ని తేదీల్లో జన్మించిన మహిళలు సహజంగా ధైర్యం, న్యాయపరమైన స్పష్టత కలిగి ఉంటారు.

35

ధైర్యవంతులు..

ఏ నెల అయినా 1, 4, 8, 9, 10, 13, 17, 18, 19, 22, 26, 27, 28, 31 తేదీలలో జన్మించిన మహిళలు అధిక స్థాయిలో ధైర్యవంతులుగా ఉంటారు. వీరిలో మౌనంగా ఉండే బలం ఉండినా, అవసరమైనప్పుడు స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం ఉంటుంది. కొందరు ధైర్యంగా ఉన్నట్లు నటిస్తారు. కానీ, వీళ్లు అలా కాదు. సత్యం కోసం నిలపడతారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు. 

45

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సరదాకి కూడా అబద్ధం  చెప్పరు.  నిజాయితీని గౌరవించేవారు ఈ మహిళలు, ద్రోహం జరిగినప్పుడు మౌనంగా ఉండరు. ఎవరైనా నమ్మకద్రోహం చేస్తే వీరు స్పందించకుండా ఉండలేరు. నిజాయితీని నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. 

ద్రోహాన్ని సహించరు..
8, 17, 26 తేదీలలో జన్మించిన వారు న్యాయంతో కూడిన హృదయాలను కలిగి ఉంటారు. మోసం, అబద్ధం లాంటి ద్రోహాలను వారు సహించలేరు. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే, సంబంధాన్ని పునర్నిర్మించటం చాలా కష్టం. వీరి నమ్మకాన్ని వొమ్ము చేస్తే తట్టుకోలేరు. నమ్మకద్రోహం చేస్తే వీరి మనసు చాలా ఎక్కువగా గాయపడుతుంది.వారిని మళ్లీ ఎప్పటికీ క్షమించరు.
 

55


ఫైనల్ గా...

సంఖ్యాశాస్త్రం అనేది శాస్త్రీయ ప్రమాణాలుగా కాకపోయినా, మన వ్యక్తిత్వాలను విశ్లేషించేందుకు ఉపయోగపడే ఓ ప్రాచీన పద్ధతి. పుట్టిన తేదీల ఆధారంగా మన బలాలు, విలువలు, బలహీనతలను తెలుసుకోవడం ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిర్భయంగా నిలబడే మహిళలను మెచ్చుకోవాలి. వీరు అన్యాయాన్ని తట్టుకోకుండా ఎదిరించేవారు మాత్రమే కాదు.. సమాజానికి మార్గదర్శకంగా కూడా నిలుస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories